Homeబిజినెస్Top 10 Richest People: ప్రపంచంలో ధనవంతులు.. టాప్‌–10లో భారతీయులు!

Top 10 Richest People: ప్రపంచంలో ధనవంతులు.. టాప్‌–10లో భారతీయులు!

Top 10 Richest People: ప్రపంచ వ్యాప్తంగా వివిధ అంశాల ఆధారంగా వివిధ సంస్థలు సర్వే చేస్తున్నాయి. దేశాల వారీగా ర్యాంకులు ప్రకటిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆహారం, ఆర్థిక విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. తాజాగా ఆర్థికంగా ప్రపంచంలో సంపన్నుల జాబితాను ఫోర్బ్స్‌ సంస్థ విడుదల చేసింది. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు పేదరికం, ధనికం, ప్రశాంతత, నేరాలు, ఆహారం తదితర అంశాల ఆధారంగా దేశాలకు ర్యాంకులు ఇస్తున్నాయి. ఫోర్బ్స్‌ సంస్థ వివిధ అంశాల్లో ప్రపంచ దేశాల ర్యాంలు విడుదల చేస్తోంది. తాజాగా ధనికుల జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్‌ – 10లో భారతీయులు ఉన్నారు. ఇది నిజంగా భారతీయులుగా మనం గర్వించే అంశం. 2025 మార్చి నాటికి, ఫోర్బ్స్‌ రియల్‌–టైమ్‌ బిలియనీర్స్‌ జాబితా ప్రకారం భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల టాప్‌–10 ఇలా ఉంది.

ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani)
సంపద: 115.3 బిలియన్‌ డాలర్లు
వ్యాపారం: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (పెట్రోకెమికల్స్, టెలికాం, రిటైల్‌)
వివరాలు: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌గా, ఆయన ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలుస్తున్నారు.

గౌతమ్‌ అదానీ (Gautam Adani)
సంపద: 84.1 బిలియన్‌ డాలర్లు
వ్యాపారం: అదానీ గ్రూప్‌ (పోర్ట్స్, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)
వివరాలు: అదానీ గ్రూప్‌ చైర్మన్‌గా, ఆయన సంపద గత ఏడాది గణనీయంగా పెరిగింది.

సావిత్రి జిందాల్‌ – కుటుంబం (Savitri Jindal & Family)
సంపద: 40 బిలియన్‌ డాలర్లు
వ్యాపారం: ఓపీ జిందాల్‌ గ్రూప్‌ (స్టీల్, పవర్‌)
వివరాలు: భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా ఆమె నిలుస్తున్నారు.

శివ్‌ నాదర్‌ (Shiv Nadar)
సంపద: 38.7 బిలియన్‌ డాలర్లు
వ్యాపారం: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (టెక్నాలజీ)
వివరాలు: హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడిగా, ఆయన ఐటీ రంగంలో ప్రముఖ వ్యక్తి.

దిలీప్‌ షాంగ్వీ (Dilip Shanghvi)
సంపద: 29.8 బిలియన్‌ డాలర్లు
వ్యాపారం: సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ (ఔషధ రంగం)
వివరాలు: సన్‌ ఫార్మా వ్యవస్థాపకుడిగా, ఆయన ఔషధ రంగంలో దిగ్గజం.

రాధాకిషన్‌ దమానీ (Radhakishan Damani)
సంపద: 31.5 బిలియన్‌ డాలర్లు
వ్యాపారం: డీ–మార్ట్‌ (రిటైల్‌)
వివరాలు: డీ–మార్ట్‌ వ్యవస్థాపకుడిగా, రిటైల్‌ రంగంలో ఆయన ప్రముఖుడు.

సైరస్‌ పూనావాలా (Cyrus Poonawalla)
సంపద: 24.5 బిలియన్‌ డాలర్లు
వ్యాపారం: సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (వ్యాక్సిన్స్‌)
వివరాలు: వ్యాక్సిన్‌ తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థకు నేతత్వం వహిస్తున్నారు.

కుమార్‌ మంగళం బిర్లా (Kumar Mangalam Birla)
సంపద: 24.8 బిలియన్‌ డాలర్లు
వ్యాపారం: ఆదిత్య బిర్లా గ్రూప్‌ (సిమెంట్, టెలికాం)
వివరాలు: ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌గా విభిన్న రంగాల్లో విస్తరణ చేశారు.

సునీల్‌ మిత్తల్‌ (Sunil Mittal)
సంపద: 30.7 బిలియన్‌ డాలర్లు
వ్యాపారం: భారతి ఎంటర్‌ప్రైజెస్‌ (టెలికాం)
వివరాలు: ఎయిర్‌టెల్‌ వ్యవస్థాపకుడిగా టెలికాం రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

బజాజ్‌ కుటుంబం (Bajaj Family)
సంపద: 23.4 బిలియన్‌ డాలర్లు
వ్యాపారం: బజాజ్‌ గ్రూప్‌ (ఆటోమొబైల్స్, ఫైనాన్స్‌)

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular