Homeఎంటర్టైన్మెంట్డే 1 సాలిడ్ వసూళ్లు రాబట్టిన “సోలో బ్రతుకే సో బెటర్”.!

డే 1 సాలిడ్ వసూళ్లు రాబట్టిన “సోలో బ్రతుకే సో బెటర్”.!

సాయి ధరమ్ తేజ్ కి మొత్తానికి బాక్సాఫీస్ వద్ద బాగానే కలిసి వచ్చింది. ‘చిత్రలహరి’ ముందు వరకూ చేసిన ‘తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలీజెంట్, తేజ్ ఐ లవ్ యు’ ఇలా తేజ్ సినిమాలన్నీ భారీ డిజాస్టర్‌ లు కావడంతో తేజ్ మార్కెట్ మొత్తం పోయింది. కానీ, మారుతి దర్శకుడిగా వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టి సాయి ధరమ్ తేజ్ మార్కెట్ ను కొంతవరకూ నిలబెట్టింది. Also Read: […]

Solo Brathuke So Better
సాయి ధరమ్ తేజ్ కి మొత్తానికి బాక్సాఫీస్ వద్ద బాగానే కలిసి వచ్చింది. ‘చిత్రలహరి’ ముందు వరకూ చేసిన ‘తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలీజెంట్, తేజ్ ఐ లవ్ యు’ ఇలా తేజ్ సినిమాలన్నీ భారీ డిజాస్టర్‌ లు కావడంతో తేజ్ మార్కెట్ మొత్తం పోయింది. కానీ, మారుతి దర్శకుడిగా వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టి సాయి ధరమ్ తేజ్ మార్కెట్ ను కొంతవరకూ నిలబెట్టింది.

Also Read: రష్మీ – సుధీర్ పర్సనల్ వీడియో లీక్: అక్కడ కూడా రొమాన్స్.. !

ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో అనుమానాల నడుమ చాలా కాలం అనంతరం విడుదల అయిన తేజ్ కొత్త సినిమా “సోలో బ్రతుకే సో బెటర్” హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. సాయి ధరమ్ తేజ్ – నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కలెక్షన్స్ బాగున్నాయి. ‘ఏ’ సెంటర్లలో గుడ్ కలెక్షన్లను సాధిస్తూ.. అటు బి.సి సెంటర్లలోనూ ఎబౌవ్ ఏవరేజ్ కలెక్షన్స్ రాబడుతూ మొత్తానికి సాయి తేజ్ మార్కెట్ మరింతగా పెంచుతుంది.

కాగా ఇప్పటివరకూ ఈ సినిమా థియేట్రికల్ షేర్ తో మంచి వసూలు చేసింది. అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీతోనే సాలిడ్ ఓపెనింగ్స్ దక్కడం విశేషం. ఇక ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్స్ ను చూస్తే..

Also Read: మహేష్ కోసం హైదరాబద్ లో ‘అమెరికా బ్యాంక్’.. !

గుంటూరు – 0.43 కోట్లు
నైజాం – 1.84 కోట్లు
వైజాగ్ – 0.57 కోట్లు
నెల్లూరు – 0.20 కోట్లు
తూర్పు గోదావరి – 0.34 కోట్లు
సీడెడ్ – 0.86 కోట్లు
కృష్ణ – 0.21 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.25 కోట్లు

మొత్తం – 4.70 కోట్లు గ్రాస్ ను ఈ సినిమా రాబట్టి… ఇంకా రోజురోజుకూ కలెక్షన్స్ పెంచుకునే దిశాగా సాగుతుంది. ఏది ఏమైనా దేశంలో సినిమా హాల్స్ లో కొన్ని గోడౌన్ లు గానూ, కళ్యాణ మండపాలగానూ మారిపోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఇలా డీసెంట్ కలెక్షన్స్ ను సాధించడం నిజంగా విశేషమే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper