Hari Hara Veeramallu : భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలకు ఇప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిందే, లేకపోతే ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేదని ట్రేడ్ విశ్లేషకులు ఒక అంచనా కి వచ్చేస్తున్నారు. ఈ ఏడాది అత్యధిక గ్రాస్ వసూళ్లను మొదటి రోజు రాబట్టిన సినిమా ఏదైనా ఉందా అంటే అది రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) మాత్రమే. మొదటి రోజు ఈ చిత్రానికి దాదాపుగా 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఇది చాలా తక్కువ వసూళ్లు అని , రామ్ చరణ్ రేంజ్ అసలు కాదని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ వినిపించాయి. ఇప్పటి వరకు మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాల లిస్ట్ కాసేపు పక్కన పెడితే బుక్ మై షో(Book My Show) యాప్ లో అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాల లిస్ట్ ని ఒకసారి చూద్దాము.
పుష్ప 2 – ది రూల్(Pushpa 2 – The Rule) :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాల నడుమ విడుదలైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పుష్ప చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించడం తో ఈ సినిమా పై ప్రారంభం నుండి అంచనాలు ఒక రేంజ్ లో ఉండేవి, ఆ అంచనాలకు తగ్గట్టుగానే మొదటి రోజు బుక్ మై షో లో ఈ చిత్రానికి 30 లక్షల టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడుపోయాయి.
కల్కి 2898 AD :
ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘కల్కి'(Kalki 2898 AD) కూడా కనీవినీ ఎరుగని అంచనాల నడుమ విడుదలైంది. ఈ సినిమాకు దాదాపుగా మొదటి రోజు 17 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అప్పట్లో ఇదే ఆల్ టైం రికార్డు.
సలార్(Salar – The Cease Fire):
కేజీఎఫ్ లాంటి సంచలనాత్మక సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్(Prashanth Neel) ప్రభాస్ తో చేసిన ఈ సినిమా పై అంచనాలు షూటింగ్ ప్రారంభ దశ నుండే భారీగా ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రానికి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా బుక్ మై షో యాప్ లో 16 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.
దేవర(Devara Movie):
#RRR వంటి సెన్సేషన్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) చేసిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా అదిరాయి. కానీ ప్రభాస్ తో పోలిస్తే హిందీ లో ఎన్టీఆర్ కి పెద్దగా మార్కెట్ లేకపోవడం వల్ల కల్కి, సలార్ రేంజ్ లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు కానీ, కేవలం తెలుగు వెర్షన్ నుండే దాదాపుగా 13 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.
గేమ్ చేంజర్:
#RRR వంటి సెన్సేషన్ తర్వాత రామ్ చరణ్ నుండి భారీ గ్యాప్ నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ రామ్ చరణ్ క్రేజ్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రోజు 8 లక్షలకు పైగానే జరిగింది.
మరో పది రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రం ఏ స్థానం లో నిలబోతుంది అనేది కామెంట్స్ రూపం లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.