Kesari 2 : బాలీవుడ్ లో నేటి తరం స్టార్ హీరోలుగా పిలవబడే వారిలో ఒకరు అక్షయ్ కుమార్(Akshay Kumar). యాక్షన్ హీరో గా ఈయనకు యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈమధ్య కాలం లో అందరూ హీరోలు భారీ హిట్స్ ని అందుకుంటున్నారు కానీ, అక్షయ్ కుమార్ కి మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ దొరకడం లేదు. మధ్యలో రెండు మూడు సినిమాలు హిట్ అయ్యాయి కానీ, అవి ఆయన రేంజ్ కి తగినవి కాదు. అలాంటి సమయంలో నిన్న విడుదలైన ‘కేసరి : చాప్టర్ 2′(Kesari : Chapter 2) మాత్రం ఆయన కెరీర్ లోనే ఇటీవల కాలంలో అద్భుతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న చిత్రంగా చెప్పొచ్చు. ‘జలియాన్వాలా బాగ్’ లో జరిగిన యదార్ధ సంఘటలను ఆధారంగా తీసుకొని ఈ కోర్టు డ్రామా ని రూపొందించారు.
Also Read : భగవంత్ కేసరి 2 డేస్ కలెక్షన్స్… హిట్ కొట్టాలంటే ఇంకా అన్ని కోట్లు రావాలి!
అయితే పాజిటివ్ టాక్ మాత్రం చాలా బలంగా వచ్చింది కానీ, విడుదలకు ముందు ప్రీ రిలీజ్ హైప్ పెద్దగా లేకపోవడం తో మొదటి రోజు కేవలం 7 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఈమధ్య కాలం లో విడుదలైన అక్షయ్ కుమార్ చిత్రాలు ‘మిషన్ రాణిగంజ్’, ‘సర్ఫిరా’, ‘ఖేల్ ఖేల్ మెయిన్’ వంటి చిత్రాలకంటే బెస్ట్ ఓపెనింగ్ వచ్చింది అనే చెప్పాలి. అయితే బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకు నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే, మొదటి రోజు వచ్చిన వసూళ్లకంటే, రెండవ రోజు వచ్చిన వసూళ్లు రెండింతలు ఎక్కువ ఉండేలా అనిపిస్తుంది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 12 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. అక్షయ్ కుమార్ కి ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోవడం ఈమధ్య కాలంలో ఏ సినిమాకు కూడా జరగలేదు.
ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజున 14 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు, మూడవ రోజున 20 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. కేవలం నార్త్ ఇండియా లో మాత్రమే కాదు, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో పాలిటన్ సిటీస్ లో కూడా ఈ చిత్రానికి నేడు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. దీనిని బట్టి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ జనాల్లో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హీరో గా ఇక అక్షయ్ కుమార్ పని అయిపోయింది అని అంతా అనుకుంటున్న సమయంలో ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ అవ్వడం ఆయన అభిమానులకు ఎక్కడ లేని ఆనందం కలిగి ఉంటుందని అనుకోవచ్చు. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి.
Also Read : భగవంత్ కేసరి’ రీమేక్ లో తమిళ హీరో విజయ్..’శ్రీలీల’ పాత్రలో మెరవనున్న హాట్ బ్యూటీ!