ఇప్పుడు దేశమంతా ఒకటే టాపిక్.. అదే వ్యాక్సిన్ విడుదల.. కేంద్ర ప్రభుత్వం ఆక్స్ ఫర్డ్-సీరం ఇనిస్టిట్యూట్ .. భారత్ బయోటెక్ తయారు చేసిన రెండు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాజకీయ రంగు పులుముకుంది.
Also Read: మహేంద్ర సింగ్ ధోని ‘పంట’ పండింది!
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేస్తున్న ‘కోవాక్సిన్’ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు కాకముందే అనుమతిస్తున్నారని.. దాని ఫలితాలు వెలువడకముందే ఎలా ఇస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఇక దీనిపైనే సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో పూనావాలా కూడా హాట్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలో 90శాతం సమర్థత చాటుకున్నవి మూడే వ్యాక్సిన్లని.. అందులో అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా, బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ అని తెలిపారు. ఇక భారత్ లో తయారు చేసిన వ్యాక్సిన్లన్నీ మంచినీళ్లతో సమానమని సెటైర్లు వేశారు.
Also Read: మిలియన్ మార్చ్.. కేసీఆర్ ను కొట్టడం కోదండరాంతో సాధ్యమేనా?
ఇది రాజకీయ దుమారాన్ని రేపింది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పరీక్షలు, సమర్థత తెలియకుండానే భారత ప్రభుత్వం అనుమతించిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్వయంగా భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా విలేకరుల సమావేశం పెట్టి వివరణ ఇచ్చారు.‘సైన్స్ యే నాకు ఆక్సిజన్ అని.. నేను ఏమీ వ్యాపారవేత్తను కానని.. శాస్త్రవేత్తను అని.. తమిళనాడు రైతు బిడ్డను అని.. మా కుటుంబానికి వ్యాపారంలో అసలేమాత్రం ప్రవేశం లేదంటూ’ కౌంటర్ ఇచ్చారు.
ఇక దేశంలోనూ కొందరు మేధావులు భారత్ బయోటెక్ కు అనుమతులు ఇవ్వడంపై విమర్శిస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం.. మన శాస్త్రవేత్తలు, భారత్ బయోటెక్ కలిసి తయారు చేసిన కోవాక్సిన్ పై మాత్రం నమ్మకం ఉంచింది. ఇలా వ్యాక్సిన్ ఫైట్ రెండు కంపెనీల మధ్యేకాదు.. దేశంలోని రాజకీయ నాయకుల మధ్య కూడా కొత్త పోరాటాన్ని చవిచూపించింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్