విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై మంగళవారం ఏపీ బీజేపీ ‘చలో రామతీర్థ’కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులను ఈరోజు ఉదయం నుంచే పోలీసులు గ్రుహ నిర్బంధం చేశారు. బీజీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. పార్వతీపురంలో ఉమా మహేశ్వరరావును పోలీసులు అడ్డుకున్నారు. కాగా బీజేపీ నేతల గ్రుహనిర్బంధంపై ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. పోలీసుల సాయంతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.