ప్రపంచ దేశాల ప్రజలు కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్లు సానుకూల ఫలితాలు ఇవ్వడంతో త్వరలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టవచ్చని ప్రజలు భావిస్తున్నారు. అయితే సాధారణ కరోనా కేసులు తగ్గినా కొత్తరకం కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సాధారణ వైరస్ తో పోలిస్తే కొత్తరకం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటం గమనార్హం.
Also Read: ‘భారత్’లో విజృంభిస్తున్న మరో వ్యాధి.. 12వేల బాతులు మృతి..?
అయితే ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు తమ వ్యాక్సిన్లు కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా ప్రభావవంతంగా పని చేస్తాయని.. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని చెబుతున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సౌత్ ఆఫ్రికా కరోనా స్ట్రెయిన్ పై వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పని చేయవని తెలుస్తోంది. బ్రిటన్ లో హెల్త్ సెక్రటరీగా పని చేస్తున్న మాట్ హాన్కాక్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. వైరస్ సోకితే మెదడులో ఆ సమస్యలు?
ఒక శాస్త్రవేత్త పరిశోధనలు చేసి కరోనా వ్యాక్సిన్లు స్ట్రెయిన్ పై పని చేయవని వెల్లడించారని ఆయన అన్నారు. గవర్నమెంట్ సైంటిఫికల్ అడ్వైజర్లలో పని చేస్తున్న ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికా వేరియంట్ బ్రిటన్ వేరియంట్ తో పోలిస్తే భిన్నంగా ఉందని.. ఈ వేరియంట్ లో మల్టీ మ్యుటేషన్స్ ఉన్నట్టు గుర్తించామని మాట్ హాన్కాక్ తెలిపారు. శాస్త్రవేత్తలు తయారు చేసిన వ్యాక్సిన్ ఆఫ్రికా వేరియంట్ పై పని చేయకపోతే శాస్త్రవేత్తలు కొత్తరకం వ్యాక్సిన్ ను తయారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కొత్తరకం కరోనా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. సాధారణ కరోనా లక్షణాలతో పోలిస్తే కొత్తరకం కరోనా వైరస్ లక్షణాలు కూడా భిన్నంగా ఉండటం గమనార్హం. అయితే ఈ ఏడాది జులై నాటికి ప్రజలకు పూర్తిస్థాయిలో కరోనా కష్టాలు తీరే అవకాశం ఉందని తెలుస్తోంది.