
రాశి ఖన్నా.. తెలుగులో చాలా సినిమాల్లో మెరిసిన ఈ అందమైన భామ ఇప్పుడు ఓ పాత్ర కోసం తనను తాను షేప్ ఔట్ చేసుకుంటోంది. ఫిట్ గా ఉండే పాత్ర కోసం కిక్ బాక్సింగ్ చేస్తూ బక్కపలచగా.. అసలు ఫిజిక్ లేకుండా తయారైంది.
ముద్దుగా.. బొద్దుగా కుర్రకారు గుండెలను పిండేసేలా ఉండే ‘రాశి ఖన్నా’ ఇప్పుడు మొత్తం షేప్ ఔట్ అయ్యిందన్న గుసగుసలు సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
మొన్నటికి మొన్న గోవాలో బికినీలో కుర్రాకారు మతిపోగోట్టేలా కనిపించిన రాశి తాజాగా కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్న ఫొటోను బయటపెట్టింది. అందులో సన్నగా నాజుగ్గా కనిపించినా షేపులన్నీ ఔట్ అయిపోయిన చందంగా కనిపించందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..
తెలుగులో సినిమాలు తగ్గించేసి తమిళ సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హిందీలో షాహిద్ కపూర్ సరసన నటించే సినిమా కోసం ఫిట్ గా తయారవుతున్నట్టు తెలిపింది. అందుకోసం బాక్సింగ్ చేస్తోందట.. పాత్ర కోసం ఇలా షేపులన్నీ ఔట్ చేసుకుంటున్న రాశిని చూసి ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.