
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బాంబు పేల్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తున్నాడు. ఆయనకు ఏం ఆధారం దొరికిందో కానీ కేసీఆర్ ను చెడుగుడు ఆడేస్తున్నాడు. త్వరలోనే కేసీఆర్ కు సంబంధించిన సంచలన ప్రకటన చేస్తున్నానని.. ఇది పార్లమెంట్ ను కుదిపేయడం ఖాయమని ట్విస్ట్ ఇచ్చాడు.
ఎంపీగా కేసీఆర్ పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించారని.. తన దగ్గర ఆధారాలున్నాయని బండి సంజయ్ ఆరోపిస్తున్నాడు. స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నానని.. బీజేపీ అధిష్టానం అనుమతితో కేసీఆర్ బండారం బయటపెడుతానని సంజయ్ అంటున్నారు.
ఇది కనుక బయటపడితే ముమ్మాటికీ పార్లమెంట్ ను కుదిపేసే అంశమవుతుందని బండి సంజయ్ బాంబు పేల్చారు.కానీ అదేంటనే విషయాన్ని మాత్రం ఇప్పటికిప్పుడు బయటపెట్టడం లేదు.
మీడియాతో చిట్ చాట్ లో సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
కపిలవాయి దిలీప్ కుమార్ తాజాగా బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని.. కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసం పీవీని వాడుకుంటున్నారని.. మోసం చేయడంలో కేసీఆర్ ఏక్ నంబర్.. కేటీఆర్ దస్ నంబర్ అని విమర్శించారు.
ఇప్పుడు బండి సంజయ్ ఆరోపిస్తున్న ఆ కేసీఆర్ గుట్టు ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది. అందుకే కేసీఆర్ కేంద్రంతో సఖ్యతతో ఉంటున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి బండి బయటపెట్టే అసలు నిజం ఏంటి? అది ఎలా కుదిపేస్తుందనేది వేచిచూడాలి.