సుప్రీంకోర్టే ఇక కీరోల్.. ఏపీలో ఎన్నికలు ఏం కానున్నాయి?

ఏపీలో ‘పంచాయితీ’ తెగడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు.. ఏపీ సీఎం జగన్ కు మధ్య టగ్ ఆఫ్ ఫైర్ నడుస్తోంది. జగన్ వెంటనే ఏపీ అధికారులు ఉండడం.. రాజ్యాంగ బద్దంగా ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషనర్ కు అధికారులు ఉండడంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠం ఏపీ రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. Also Read: ఎన్నికల ఫైట్.. గెలుపు నిమ్మగడ్డదా..? జగన్ దా..? ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈరోజు […]

Written By: NARESH, Updated On : January 23, 2021 4:20 pm
Follow us on

ఏపీలో ‘పంచాయితీ’ తెగడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు.. ఏపీ సీఎం జగన్ కు మధ్య టగ్ ఆఫ్ ఫైర్ నడుస్తోంది. జగన్ వెంటనే ఏపీ అధికారులు ఉండడం.. రాజ్యాంగ బద్దంగా ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషనర్ కు అధికారులు ఉండడంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠం ఏపీ రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది.

Also Read: ఎన్నికల ఫైట్.. గెలుపు నిమ్మగడ్డదా..? జగన్ దా..?

ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈరోజు నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు ఈ ఎన్నికలను అడ్డుకుంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో పడింది. తప్పుల తడకగా పిటీషన్ ఉందని.. సరిచేసి వేయాలని సుప్రీం ఆదేశించింది.

అయితే సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ తాజాగా అత్యవసర పిటీషన్ వేసి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆపాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయంపైనే ‘ఏపీ పంచాయితీ’ ఆధారపడి ఉంది. ఏపీలో ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

Also Read: బీజేపీ ‘సాగర’మథనం

ఒకవేళ సుప్రీంకోర్టు గనుక ఎన్నికలు ఆపేస్తే జగన్ సర్కార్ విజయం సాధిస్తుంది. ఏపీలో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ఆగిపోతుంది. నిమ్మగడ్డ పంతం నెగ్గకుండా పోతుంది. అయితే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం మొత్తం ఏపీ ప్రభుత్వం అధికారాలు పోయి ఎస్ఈసీ నిమ్మగడ్డ చేతిలోకి అధికారం రావడం ఖాయంగా కనిపిస్తుంది. నిమ్మగడ్డ బదిలీలు చేయవచ్చు.. ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీసే ప్లాన్లు రూపొందించవచ్చు. అయితే నిమ్మగడ్డకు ఏపీ ప్రభుత్వం ఎంత మేరకు సహకరిస్తుంది? అసలు ఎన్నికలు జరుగుతాయా? లేవా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్