అంపశయ్యపై మరో కురువృద్ధ నేత

ఆర్జేడీ అధినేత.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న బిహార్ కురవృద్ధుడు ఇప్పటికే రాంచీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా మూడు రోజులుగా అతడి ఆరోగ్యం మరింత విషమించింది. తేజస్వి యాదవ్, రబ్రీదేవీ శుక్రవారం రాత్రి లాలూను పరామర్శించారు. తన తండ్రికి మెరుగైన వైద్యం అందించాలని తేజస్వి యాదవ్ జార్ఖండ్ ముఖ్యమంత్రిని కోరారు. దీంతో వైద్యుల సూచన మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ […]

Written By: Srinivas, Updated On : January 23, 2021 3:08 pm
Follow us on


ఆర్జేడీ అధినేత.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న బిహార్ కురవృద్ధుడు ఇప్పటికే రాంచీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా మూడు రోజులుగా అతడి ఆరోగ్యం మరింత విషమించింది. తేజస్వి యాదవ్, రబ్రీదేవీ శుక్రవారం రాత్రి లాలూను పరామర్శించారు. తన తండ్రికి మెరుగైన వైద్యం అందించాలని తేజస్వి యాదవ్ జార్ఖండ్ ముఖ్యమంత్రిని కోరారు. దీంతో వైద్యుల సూచన మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.

Also Read: బీజేపీ ‘సాగర’మథనం

లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25శాతమే పనిచేస్తున్నాయని, మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించామని వైద్యులు తెలిపారు. లాలూ ఆరోగ్యం విషమించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో లాలూకు బెయిల్ మంజూరు చేయాలని అతడి తరఫు న్యాయవాదులు పాట్నా హైకోర్టులో ఫిల్ దాఖలు చేయగా.. విచారణలో ఉంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Tags