https://oktelugu.com/

ప్రభాస్ ఫ్యాన్స్ కు నాగ్ అశ్విన్ సర్ప్రైజ్.. అది ఏంటంటే?

టాలీవుడ్ టాప్ హీరోలగా రాణిస్తున్న వారిలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు. బాహుబలి చిత్రం ద్వారా దేశం మొత్తం ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి సినిమా ప్రభాస్ కి ఎంతటి గుర్తింపు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ కు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంలోనే ప్రభాస్ ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. అయితే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 23, 2021 / 03:59 PM IST
    Follow us on

    టాలీవుడ్ టాప్ హీరోలగా రాణిస్తున్న వారిలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు. బాహుబలి చిత్రం ద్వారా దేశం మొత్తం ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి సినిమా ప్రభాస్ కి ఎంతటి గుర్తింపు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ కు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంలోనే ప్రభాస్ ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం తెలియడం లేదు. ఈ సందర్భంగానే ఈ సినిమా గురించి దర్శకుడు ఓ సందర్భంలో ప్రభాస్ సినిమా గురించి సంక్రాంతి తర్వాత అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు.

    Also Read: ఆర్ఆర్ఆర్ యూనిట్ కు ఝలక్.. రిలీజ్ డేట్ లీక్..?

    అయితే సంక్రాంతి పండుగ పూర్తి చేసుకొని దాదాపు పది రోజులు కావస్తున్న ఈ సినిమా పట్ల దర్శకుడు ఎలాంటి సమాచారం తెలుపక పోవడంతో దీనిపై ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్స్ కి స్పందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమా గురించి జనవరి 26న లేదా ఫిబ్రవరి 26న అప్డేట్స్ ఇవ్వనున్నట్లు డేట్ తో సహా తెలియజేశారు. దీంతో నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమా గురించి మరి కొంత సమాచారం కోసం మరొక నెల పాటు ఎదురు చూడాలని అభిమానులు భావించారు.

    Also Read: కేజీఎఫ్ 2 మూవీ తెలుగు హక్కులు అన్ని కోట్లా..?

    ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాధేశ్యామ్” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్”చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్