Homeజాతీయ వార్తలుAfghanistan Pakistan clashes : ఆపరేషన్ సిందూర్‌లో భారత్ కొట్టిన దెబ్బ మానకముందే.. పాక్‌పై అఫ్గాన్‌...

Afghanistan Pakistan clashes : ఆపరేషన్ సిందూర్‌లో భారత్ కొట్టిన దెబ్బ మానకముందే.. పాక్‌పై అఫ్గాన్‌ భారీ దెబ్బ

Afghanistan Pakistan clashes : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించారు. దీనికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. కేవలం ఐదు రోజుల్లో పాకిస్తాన్‌ను తుక్కుతుక్కు చేసింది. 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. 11 ఎయిర్‌ బేస్‌లపై దాడిచేసింది. భారత్‌ కొట్టిన దెబ్బల గాయాలు ఇంకా మానలేదు. ఇప్పుడు పాకిస్తాన్‌ పొరుగు దేశం ఆఫాగనిస్తాన్‌.. అవే గాయాలపై కొడుతున్న దెబ్బలకు పాకిస్తాన్‌కు వాచిపోతోంది. పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మధ్య డ్యూరాండ్‌ లైన్‌ ఘర్షణ కొనసాగుతోంది. మరోవైపు ఆఫ్గానిస్తాన్‌లోని తెహ్రీక్‌ ఎ తాలిబాన్‌ పాకిస్తాన్‌ ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో దాడులు చేస్తునా‍్నరు. దీంతో పాకిస్తాన్‌ ఆఫ్గానిస్తాన్‌పై వైమానికి దాడులకు దిగింది. దీంతో ఆఫ్గానిస్తాన్‌ కూడా ప్రతిదాడులు చేస్తోంది. పాకిస్తాన్‌ వైమానికి దాడులు చేస్తుంటే.. ఆఫ్గానిస్తాన్‌ డ్రోన్‌ దాడులు చేస్తోంది.

నూర్‌ఖాన్‌ను టార్గెట్‌ చేసిన అఫ్గాన్..
ఆదివారం తెల్లవారుజామున అఫ్గాన్ సైనికులు, తాలిబాన్లు రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారీ దాడి చేశారు. ఇది పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. క్వెట్టాలో 12వ కార్ప్స్ కమాండ్ సెంటర్, ఖైబర్ పక్తూంఖ్వా ప్రాంతంలోని సైనిక బలగాలు కూడా లక్ష్యాలుగా మారాయి. ఈ దాడుల్లో ఎయిర్‌ బేస్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయని అఫ్గాన్ రక్షణ శాఖ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ దాడి తర్వాత రిపేర్ అవుతున్న ఈ బేస్‌పై మళ్లీ దాడి పాక్‌కు రెట్టింపు నష్టం కలిగించింది.

పాక్ ప్రతీకార చర్యలు..
పాకిస్తాన్ తమ దేశంలోని ప్రాంతాలపై అఫ్గాన్ దాడులు జరిగాయని, చొరబాట్లకు ప్రతిగా ఈ చర్యలు అని అఫ్గాన్ వాదన. మరోవైపు జలాలాబాద్ ప్రాంతంలో పాక్ యుద్ధ విమానాన్ని (F-16గా పేర్కొన్నారు) కూల్చివేసి పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాక్ ‘గజీబ్ లిల్ హక్’ ఆపరేషన్‌తో కౌంటర్ దాడులు చేస్తూ కాబూల్‌పై వైమానిక దాడులు చేసింది, 133 మంది తాలిబాన్ సైనికులు మరణించారని పేర్కొంది.

ఈ సంఘర్షణ పాక్ అంతర్గత సమస్యలను (బలూచ్ తిరుగుబాటు) పెంచుతూ, ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తోంది. ఇరుదేశాలు యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించాయి, మధ్యవర్తిత్వాలు అవసరం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...
Oktelugu Epaper
Exit mobile version