కొత్త ఎస్‌ఈసీ దూకుడు.. ఈ నెలలో మళ్లీ మున్సి‘పోల్‌’

నీలం సాహ్ని.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఐఏఎస్‌ సర్వీస్‌లో చేరినప్పుడు ఎంత యాక్టివ్‌గా పనిచేశారో.. ఇప్పుడు కూడా అదేస్థాయిలో దూసుకెళ్తున్నారు. ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే నోటిఫికేషన్ ఇచ్చేసి.. తనది మామూలు స్పీడ్ కాదని నిరూపించేశారు. ఇక ఏప్రిల్ నెలాఖరులోపు పెండింగ్‌లో ఉన్న స్థానిక ఎన్నికలన్నింటినీ కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం కసరత్తు చేస్తున్నారు. పరిషత్ ఎన్నికలను రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క రోజులోనే పెట్టేయాలన్న సాహసోపేత […]

Written By: Srinivas, Updated On : April 6, 2021 10:26 am
Follow us on


నీలం సాహ్ని.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఐఏఎస్‌ సర్వీస్‌లో చేరినప్పుడు ఎంత యాక్టివ్‌గా పనిచేశారో.. ఇప్పుడు కూడా అదేస్థాయిలో దూసుకెళ్తున్నారు. ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే నోటిఫికేషన్ ఇచ్చేసి.. తనది మామూలు స్పీడ్ కాదని నిరూపించేశారు. ఇక ఏప్రిల్ నెలాఖరులోపు పెండింగ్‌లో ఉన్న స్థానిక ఎన్నికలన్నింటినీ కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం కసరత్తు చేస్తున్నారు.

పరిషత్ ఎన్నికలను రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క రోజులోనే పెట్టేయాలన్న సాహసోపేత నిర్ణయం తీసుకున్న ఆమె .. కోర్టు కేసులను కూడా లైట్ తీసుకుంటున్నారు. జరిగినవి కాకుండా.. రాష్ట్రంలో ఇంకా 32 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కోర్టు కేసులతోపాటు వివిధ కారణాల వల్ల వీటికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించి ఈ నెలాఖరులోపు ఎన్నికలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో సాహ్ని ఉన్నారు.

సాధారణంగా కోర్టుల్లో కేసులు ఉంటే.. కోర్టు తీర్పులు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. కానీ.. నీలం సాహ్ని మాత్రం కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ నిర్ణయం తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎస్‌ఈసీ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి లేదన్న వాదనను హైకోర్టులో వినిపిస్తున్నారు.

పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ కొనసాగింపు విషయంలో జరిగింది కూడా ఇదే. కోర్టుల్లో కేసులున్నప్పటికీ.. మిగతా కార్పొరేషన్లు.. మున్సిపాలిటీల్లోనూ ఈ నెలాఖరుకల్లా ఎన్నికలు నిర్వహించేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పని చేసిన నీలం సాహ్ని కోర్టులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కానీ.. వారి విమర్శలన్నీ రాజకీయ ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. ఆ విమర్శలను సైతం ఆమె పట్టించుకోవడం లేదు. అంతేకాదు.. తాను అనుకున్నదే చేయాలని ఫిక్స్‌ అయినట్లుగా అర్థమవుతోంది. అందుకే.. ఒకటి తర్వాత మరొకటి ఎన్నికల ప్రక్రియను తొరగా పూర్తిచేయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.