ఎస్బీఐ సూపర్ స్కీమ్.. రూ.100తో 10 లక్షలు..?

దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు ఉన్న బ్యాంక్ ఎస్బీఐ అనే సంగతి తెలిసిందే. ఎస్బీఐ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తుండగా ఆ స్కీమ్ లలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి. ఎస్బీఐ కేవలం తమ బ్యాంకు కస్టమర్లకు మాత్రమే ఈ స్కీమ్ లో చేరే అవకాశం కల్పిస్తుండటం గమనార్హం. బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ లో కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను తెరవచ్చు. […]

Written By: Navya, Updated On : April 5, 2021 3:39 pm
Follow us on

దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు ఉన్న బ్యాంక్ ఎస్బీఐ అనే సంగతి తెలిసిందే. ఎస్బీఐ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తుండగా ఆ స్కీమ్ లలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి. ఎస్బీఐ కేవలం తమ బ్యాంకు కస్టమర్లకు మాత్రమే ఈ స్కీమ్ లో చేరే అవకాశం కల్పిస్తుండటం గమనార్హం. బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ లో కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను తెరవచ్చు.

ఎవరైతే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను తెరవాలని అనుకుంటారో వాళ్లు సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లాలి. 15 సంవత్సరాల మెచ్యూరిటీ కాలం ఉన్న ఈ స్కీమ్ లో చేరాలంటే 500 రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తుండగా కేంద్రం ఈ స్కీమ్ వడ్డీరేట్లలో మార్పులు చేస్తూ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతా తెరవాలని అనుకునే వాళ్లు సులువుగానే ఖాతా తెరవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు. పీపీఎఫ్ ఖాతాను పిల్లల పేర్లపై కూడా తెరిచే అవకాశం ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ స్కీమ్ వడ్డీ రేట్లు మారడం లేదా స్థిరంగా ఉండటం జరుగుతుంది. రోజుకు 100 రోజుల చెప్పున ఆదా చేసి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 10 లక్షలు చేయవచ్చు.

బ్రాంక్ బ్రాంచ్ కు వెళ్లడం ద్వారా లేదా ఆన్ లైన్ ద్వారా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో నెలకు 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా మూడు లక్షల రూపాయలు సొంతమవుతాయి.