https://oktelugu.com/

సీమ రక్త చరిత్రలోనే ఆసక్తికర సీన్?

సీమ రక్త చరిత్రలోనే వాళ్లిద్దరివీ నెత్తుటి మరకలు ఎన్నో.. ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎంత మంది అసువులు బాసిన చరిత్ర ఆ కుటుంబాలకు ఉంది. అలాంటి శత్రువులు కలవడం చూస్తామా? అని రాయలసీమ మొత్తం డౌట్ పడుతున్న వేళ ఎట్టకేలకు ఆ అరుదైన దృశ్యం సీమ చరిత్రలో ఆవిష్కృతమైంది.. Also Read: ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ కుదురుగా అనంతపురం ఫ్యాక్షన్ చరిత్రలో పరిటాల కుటుంబానికి, జేసీ కుటుంబానికి అస్సలు పడదు. ఈ రెండూ వైరిపక్షాలు.. జేసీ కుటుంబం కాంగ్రెస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2020 4:35 pm
    Follow us on

    Paritala sriram and JC pavan

    సీమ రక్త చరిత్రలోనే వాళ్లిద్దరివీ నెత్తుటి మరకలు ఎన్నో.. ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎంత మంది అసువులు బాసిన చరిత్ర ఆ కుటుంబాలకు ఉంది. అలాంటి శత్రువులు కలవడం చూస్తామా? అని రాయలసీమ మొత్తం డౌట్ పడుతున్న వేళ ఎట్టకేలకు ఆ అరుదైన దృశ్యం సీమ చరిత్రలో ఆవిష్కృతమైంది..

    Also Read: ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ కుదురుగా

    అనంతపురం ఫ్యాక్షన్ చరిత్రలో పరిటాల కుటుంబానికి, జేసీ కుటుంబానికి అస్సలు పడదు. ఈ రెండూ వైరిపక్షాలు.. జేసీ కుటుంబం కాంగ్రెస్ లో ఉంటే.. పరిటాల టీడీపీలో ఉండి.. ఎవరిది అధికారంలో ఉంటే వారు శత్రువులనే వేటాడేవారు.

    కానీ 2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోయాక.. విభజించిన పాపానికి కాంగ్రెస్ పార్టీలో ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీనే నమ్ముకొని ఉన్న జేసీ ఫ్యామిలీ ఇక గత్యంతరం లేక టీడీపీలో చేరింది. అయితే టీడీపీలో చేరినా పరిటాల కుటుంబం.. జేసీ కుటుంబం శత్రువులుగానే అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. కానీ తొలిసారి రైతుల సమస్యలపై ఈ రెండు కుటుంబాలు ఏకమయ్యాయి.

    Also Read: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం..!

    తాజాగా రైతు సమస్యలపై కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిర్వహించిన ఆందోళనలో పరిటాల శ్రీరామ్, జేసీ పవన్ కుమార్ రెడ్డిలు కలిసి ఆందోళన చేయడం టీడీపీ నేతల కళ్లు చల్లబడేలా చేసింది.. ఇద్దరూ కలిసి పాదయాత్ర చేసిన వీడియోలు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ఫ్యాక్షన్ రాజకీయాలను వదిలి వీరిద్దరూ కలిసిపోయి గొప్ప స్ఫూర్తిని చాటారని టీడీపీ నేతలు మెచ్చుకుంటున్నారు. తెలుగుదేశం నేతలు వీరిద్దరి కలయికపై హర్షం వ్యక్తం చేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్