https://oktelugu.com/

అఖిల్‌ కనిపించడే..?

ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చాడు అఖిల్‌. ఒక వారమో రెండు వారాలో ఉంటాడని అనుకున్నాడు. కానీ.. చివరకు టాప్‌ ఫైవ్‌లో నిలిచాడు. అంతేకాదు టాప్‌ టూ వరకూ వెళ్లాడు. అది మోనాల్‌తో సాగించిన లవ్‌ ట్రాక్‌ కావచ్చు.. లేదా ప్రతీ టాస్క్‌లోనూ గట్టిగా పోరాడడం వల్లనూ కావచ్చు. Also Read: ఫ్రీ సమ్మర్ లో నితిన్ ‘చెక్’.. అలాగే బోల్డ్ సినిమా కూడా ! అంతేకాదు.. హౌస్‌లో అందరికన్నా ముందుగానే టాప్‌ ఫైవ్‌ లోకి […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 29, 2020 / 11:40 AM IST
    Follow us on


    ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చాడు అఖిల్‌. ఒక వారమో రెండు వారాలో ఉంటాడని అనుకున్నాడు. కానీ.. చివరకు టాప్‌ ఫైవ్‌లో నిలిచాడు. అంతేకాదు టాప్‌ టూ వరకూ వెళ్లాడు. అది మోనాల్‌తో సాగించిన లవ్‌ ట్రాక్‌ కావచ్చు.. లేదా ప్రతీ టాస్క్‌లోనూ గట్టిగా పోరాడడం వల్లనూ కావచ్చు.

    Also Read: ఫ్రీ సమ్మర్ లో నితిన్ ‘చెక్’.. అలాగే బోల్డ్ సినిమా కూడా !

    అంతేకాదు.. హౌస్‌లో అందరికన్నా ముందుగానే టాప్‌ ఫైవ్‌ లోకి చేరాడు. దీంతో అందరి దృష్టి పడింది. అయినా అఖిల్‌ కూడా చివరి వరకూ గట్టి పోటీనే ఇచ్చాడు. చివరకు విన్నర్‌‌ అఖిలా.. అభిజితా అనే పరిస్థితి వరకు వచ్చాడు. ఫైనల్‌గా రన్నర్‌‌గా మిగిలాడు. సాధారణంగా విన్నర్ తోపాటు రన్నర్ కు కూడా కాస్త పబ్లిసిటీ, హడావుడి ఉంటుంది. కానీ.. ఈసారి చిత్రంగా రన్నరప్ ఉండగానే అతనికి కాకుండా మరొకరికి ప్రచారం వచ్చేసింది. అఖిల్‌కు రావాల్సిన క్రెడిట్ అంతా సోహెల్ కొట్టేశాడు.

    Also Read: బ్రేకింగ్: మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు కరోనా పాజిటివ్

    ఇదిలావుంటే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటికి వచ్చాక కంటెస్టెంట్ల హడావుడి అంతా ఇంతా కాదు. ఒకటే ఊరేగింపులు.. ఇంటర్వ్యూలు.. ప్రచారాలు. టాప్‌ఫైవ్‌లో అభిజిత్, సోహైల్, అరియానా ఈ హడావుడిలో భాగం అయ్యారు. హారిక మాత్రం పెద్దగా హడావుడి చేయలేదు. ఇక రన్నర్ అప్ అయిన అఖిల్ జాడే తెలియడం లేదు. విన్నర్ అభిజిత్ తెగ హడావుడి చేస్తుంటే.. అఖిల్ మాత్రం గాయబ్ అయిపోయాడు. చివరి మినిట్‌లో అఖిల్‌ బాగా డిస్సపాయింట్‌ అయినట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఆయన పెద్దగా బయటికి రాకుండా ఇంటికే పరిమితం అయినట్లుగా కనిపిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్