https://oktelugu.com/

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం..!

కరోనా వైరస్.. కరోనా కొత్త స్ట్రెయిన్ పదాలను వింటేనే ప్రపంచం బెంబెలేత్తిపోతుంది. కరోనా వైరస్ నుంచి ప్రపంచం ఇంకా కోలుకోక ముందే కరోనా కొత్త స్ట్రెయిన్ మానవాళికి మరో సవాల్ విసరడం శోచనీయంగా మారింది. Also Read: ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ కుదురుగా కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని సంబరపడేలోపే కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు అధికంగా నమోదవుతుండటంతో అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. భారత్ సైతం కరోనా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 29, 2020 / 11:28 AM IST
    Follow us on

    carona

    కరోనా వైరస్.. కరోనా కొత్త స్ట్రెయిన్ పదాలను వింటేనే ప్రపంచం బెంబెలేత్తిపోతుంది. కరోనా వైరస్ నుంచి ప్రపంచం ఇంకా కోలుకోక ముందే కరోనా కొత్త స్ట్రెయిన్ మానవాళికి మరో సవాల్ విసరడం శోచనీయంగా మారింది.

    Also Read: ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ కుదురుగా

    కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని సంబరపడేలోపే కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు అధికంగా నమోదవుతుండటంతో అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి.

    భారత్ సైతం కరోనా కొత్త స్ట్రెయిన్ పట్ల రాష్ట్రాలను అప్రమత్తంగా చేస్తోంది. విదేశాలను నుంచి వచ్చేవారికి ఎయిర్ పోర్టుల్లోనే కరోనా టెస్టులు నిర్వహిస్తూ అనుమానితులను హోం క్వారంటైన్ కు పంపుతున్నారు.

    కరోనా కొత్త స్ట్రెయిన్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. యూకే నుంచి తెలంగాణకు వచ్చిన 21 మందికి ఇటీవల టెస్టులు చేయగా ఇద్దరికి కరోనా కొత్త వైరస్ సోకినట్లు తేలింది.

    యూకే నుంచి వరంగల్ అర్బన్‌కు వచ్చిన 49ఏళ్ల వ్యక్తికి ఈ కొత్తరకం కరోనా సోకినట్లు సీసీఎంబీ అధికారులు నిర్ధారించారు.దీంతో వైద్యా సిబ్బంది అతడితో సన్నిహతంగా ఉన్న కుటుంబ సభ్యులకు, ఇతరులకు కరోనా టెస్ట్ లు నిర్వహించారు.

    Also Read: జనసేన గూటికి వంగవీటి రాధాకృష్ణ ?.. కీలక భేటి

    అయితే అతడి తల్లికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. మరోవైపు ఏపీలోనూ కరోనా కొత్త వైరస్ టెన్షన్ నెలకొంది.

    ఏపీకి డిసెంబర్లో ప్రారంభం‌లో యూకే నుంచి 1346 మంది ప్రయాణికులు వచ్చారు. అయితే వీరిలో 1324మందిని అధికారులు గుర్తించి క్వారంటైన్‌కు తరలించగా మరో 13మంది ఆచూకీ లభించడం లేదు.

    దీంతో వారి కోసం అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. రెండు రాష్ట్రాల్లో కరోనా కొత్త వైరస్ కలవరం సృష్టిస్తుంటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్