ఏపీలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం అధికార పార్టీకి షాకిచ్చింది.
ఎస్ఈసీ నిమ్మగడ్డ అధికార వైసీపీని ముప్పుతిప్పలు పెడుతున్నా కూడా గ్రామాల్లో ప్రజలు మాత్రం అభివృద్ధి కోణంలో అధికార పార్టీకే మద్దతు పలుకుతున్నారు.నిమ్మగడ్డ సొంతూరులో సైతం వైసీపీ మద్దతుదారులు గెలవడం విశేషం.
కాగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు భారీగా పెరగడం ఎస్ఈసీ నిమ్మగడ్డకు షాక్ లా మారింది. ఇప్పటికే ఏకగ్రీవాలపై అనుమానంతో వాటిని నిలిపివేసి మళ్లీ గవర్నర్ జోక్యంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిమ్మగడ్డకు తాజాగా రెండో విడతలోనూ ఏకగ్రీవాలు పెరగడం మింగుడుపడడం లేదు.
తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 167 మండలాల పరిధిలో 3328 గ్రామ పంచాయతీల్లో రెండో దశ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో అన్ని జిల్లాల్లో కలిపి 539 పంచాయతీలు ఏకగ్రీవం అయినట్టు ఎస్ఈసీ వెల్లడించారు. ఈనెల 13న ఈ పంచాయతీలకు ఎన్నిక జరుగనుంది.