ఆత్మనిర్భర్ పేరిట భారతీయులు తయారు చేసిన.. భారత్ లోనే తయారైన వస్తువులనే వాడాలి.. కొనాలి.. వినియోగించాలని ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడైతే పిలుపునిచ్చాడో ఇప్పుడు అదొక ఉద్యమంగా మారిపోయింది. తాజాగా రైతు ఉద్యమ నేతలకు సపోర్టుగా నిలిచిన ట్విట్టర్ కు చెక్ పెట్టింది కేంద్రం.
రైతు ఉద్యమకారులు ట్విట్టర్ లో మోడీని, కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం.. ఆ అకౌంట్లను బ్లాక్ చేయాలని ఆదేశించినా ట్విట్టర్ జాప్యం చేయడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. భావ ప్రకటన స్వేచ్ఛను హరించమంటూ ట్విట్టర్ సమాధానం ఇవ్వడంతో ఇప్పుడు ట్విట్టర్ కు సెగ పుట్టించే చర్యలకు మోడీ సర్కార్ దిగుతోంది.
ట్విట్టర్ కు పోటీ తాజాగా దేశీయ యాప్ ‘కూ’ను కేంద్రం ఎంకరేజ్ చేస్తోంది. ఈ మేరకు భారత ప్రభుత్వం మెచ్చిన ఆత్మనిర్భర యాప్ ఇదీ అంటూ ఏకంగా కేంద్రమంత్రులు అదే ట్విట్టర్ లో షేర్ చేసి తమను ఫాలో అయ్యే వారంతా ఇందులో చేరాలని పిలుపునివ్వడం విశేషంగా మారింది.
దీన్ని బట్టి రైతు ఉద్యమానికి సపోర్టుగా నిలబడిన ట్విట్టర్ ను బహిష్కరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ .. ఆ తర్వాత పలువురు మంత్రులు, కేంద్రంలోని మంత్రిత్వశాఖలు కూడా ‘కూ’యాప్ లో చేరి తమ ట్విట్టర్ ఖాతాల్లో ‘కూ’లింకులు షేర్ చేయడంతో కేంద్రప్రభుత్వం ఈ భారత యాప్ ను ప్రమోషన్ చేయాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ బాంబినేట్ టెక్నాలజీస్ లిమిటెడ్ సీఈవో అప్రమేయ రాధాకృష్ణ, మరో వ్యాపారవేత్త మయాంక్ బిద్వత్క సంయుక్తంగా ఈ యాప్ ను రూపొందించారు. 2020 మార్చిలో విడుదల చేశారు. ట్విట్టర్ ను పోలిన ఈ యాప్ ఆత్మనిర్భర్ యాప్ చాలెంజ్ లో తొలి స్థానంలో నిలిచింది. దీన్ని ఇప్పటికే 25 లక్షల మంది డౌన్ లో చేసుకోవడం విశేషం. మొత్తంగా ట్విట్టర్ కు ప్రత్యామ్మాయంగా కేంద్రం పరోక్షంగా ‘కూ’ ను ప్రోత్సహిస్తోందన్నమాట..
I am now on Koo.
Connect with me on this Indian micro-blogging platform for real-time, exciting and exclusive updates.
Let us exchange our thoughts and ideas on Koo.
📱 Join me: https://t.co/zIL6YI0epM pic.twitter.com/REGioTdMfm
— Piyush Goyal (@PiyushGoyal) February 9, 2021