Site icon OkTelugu

America Israel Airstrike Iran: యుద్ధం మృదయ విదారం..

America Israel Airstrike Iran

America Israel Airstrike Iran

America Israel Airstrike Iran: ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన అమెరికా.. ఇజ్రాయెల్‌ సహకారంతో ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. టెహ్రాన్‌పై మిసైళ్లతో దాడిచేసింది. దీంతో ఇరాన్‌ మినాబ్‌లోని బాలికల పాఠశాలలో 100 మందికిపైగా పిల్లల మరణించారు. ఈ ఘటన అమాయకులను బలి తీసుకోవడం విషాదం.

Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!

పాఠశాలపై వైమానిక దాడి..
హోర్ముజ్‌ ప్రాంతంలోని మినాబ్‌ నగరంలో షజారా తయ్యాబా ప్రాథమిక పాఠశాలపై ఫిబ్రవరి చివర ఇజ్రాయెల్‌ వైమానిక దాడి జరిగింది. 108 మంది విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రారంభ అంచనాలు 40–85 మధ్య ఉన్నాయి. IRGC స్థావరానికి సమీపంలో ఉన్న పాఠశాల ధ్వంసమైంది. విద్యార్థుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. పుస్తకాలు, బ్యాగులు చుట్టూ ఎగిరిపడ్డాయి. తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లలు ఇలా విగతజీవులుగా మారడం అందరినీ కలిచివేస్తోంది. చాలామంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ఈ సంఘటన మధ్యప్రాచ్య యుద్ధాన్ని విస్తరింపజేసే అవకాశం ఉంది. పౌరుల మరణాలు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలకు దారితీస్తాయి. ఇరాన్‌ ప్రతిఘటనలు ఆర్థిక మార్గాలను, సముద్ర మార్గాలను ప్రభావితం చేయవచ్చు.

Exit mobile version