జగన్ సర్కార్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ముందుకు వెళుతున్న నేపథ్యంలో అవి ఆపాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు ఎక్కింది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. Also Read: వేడి పుట్టిస్తున్న అసెంబ్లీ సమావేశాలు పంచాయితీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ పంచాయితీరాజ్ […]

Written By: NARESH, Updated On : December 3, 2020 7:37 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ముందుకు వెళుతున్న నేపథ్యంలో అవి ఆపాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు ఎక్కింది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

Also Read: వేడి పుట్టిస్తున్న అసెంబ్లీ సమావేశాలు

పంచాయితీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటీషన్ వేశారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయించిందని వాదించారు. ఈ ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు.

జగన్ ప్రభుత్వం సలహా, అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల సంఘం నవంబర్ లో ఉత్తర్వులు ఇచ్చిందని ప్రభుత్వం తరుఫున వాదించారు. కరోనాతో 6వేల మంది చనిపోయారని.. ఇప్పటికే 11223మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

Also Read: టీడీపీ ఆన్‌ ఫైర్

ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి మూడు సార్లు తెలియజేశానని ఎన్నికల సంఘం తరుఫు న్యాయవాది అశ్విన్ కుమార్ వాదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నవంబర్ 17న ఇచ్చిన ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిటీషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్