https://oktelugu.com/

నవ్వులు పంచిన అసెంబ్లీ

అసెంబ్లీ నవ్వులు పంచడం ఏంటని ఆశ్చర్య పోకండి..! బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూడండి మీకే అర్థం అవుతుంది. అదికూడా ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుపై చర్చలో భాగంగా ఈ సీన్‌ కనిపించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ బాబు హ‌యాంలో ప్రాజెక్టు పూర్తి అయిందని, చూసేందుకు రండి.. అంటూ పెద్ద ఎత్తున జ‌నాన్ని తీసుకెళ్లార‌ని గుర్తు చేశారు. పునాదుల్లో ఉన్న ప్రాజెక్టును చూపించి, కీర్తనలు పాడించుకుని తరించిపోయారని విమ‌ర్శించారు. ఇందుకోసం ఏకంగా రూ.83.45 […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 3, 2020 / 04:53 PM IST
    Follow us on


    అసెంబ్లీ నవ్వులు పంచడం ఏంటని ఆశ్చర్య పోకండి..! బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూడండి మీకే అర్థం అవుతుంది. అదికూడా ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుపై చర్చలో భాగంగా ఈ సీన్‌ కనిపించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ బాబు హ‌యాంలో ప్రాజెక్టు పూర్తి అయిందని, చూసేందుకు రండి.. అంటూ పెద్ద ఎత్తున జ‌నాన్ని తీసుకెళ్లార‌ని గుర్తు చేశారు. పునాదుల్లో ఉన్న ప్రాజెక్టును చూపించి, కీర్తనలు పాడించుకుని తరించిపోయారని విమ‌ర్శించారు. ఇందుకోసం ఏకంగా రూ.83.45 కోట్లు ఖర్చు చేశారని మండిప‌డ్డారు.

    Also Read: జగన్ సర్కార్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ

    జయము.. జయము చంద్రన్నా..

    పునాధుల్లో ఉన్న ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లినప్పుడు ‘జయము.. జయము చంద్రన్నా..’ అంటూ మహిళలు పాడుతూ భజన చేస్తున్న ఓ వీడియోను జ‌గ‌న్ అసెంబ్లీలో ప్రదర్శించారు. దీంతో సభంతా నవ్వులు పూశాయి. ఈ వీడియో చూసిన సభ్యులు విరగబడి నవ్వారు. సీఎం జగన్‌ సైతం బిగ్గరగా నవ్వారు. చంద్రబాబు మాత్రం నవ్వుల పాలు అయ్యారు.

    Also Read: వేడి పుట్టిస్తున్న అసెంబ్లీ సమావేశాలు

    గతంలో వైఎస్సార్

    గ‌తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కూడా అసెంబ్లీ స‌మావేశాల్లో బిగ్గరగా నవ్విన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. సమస్యలు చెబుతుంటే నవ్వెలా వస్తుందయ్యా.. అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసినా.. వైఎస్‌ తన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. ‘నవ్వడం ఒక యోగ‌ం.. నవ్వలేకపోవడం ఓక రోగం.. బాబుకు నవ్వు రాకపోతే నేనేం చేయాలంటూ’ వైఎస్‌ సెటైర్‌‌ వేయడం అప్పట్లో హాట్‌ టాపిక్. ఇప్పుడు జగన్‌ కూడా అదే లెవెల్లో నవ్వడంతో తండ్రి బాటలో తనయుడు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జోరందుకున్నది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్