Homeఅత్యంత ప్రజాదరణఆర్థికంగా నలిగిపోయిన మాజీ హీరోయిన్ !

ఆర్థికంగా నలిగిపోయిన మాజీ హీరోయిన్ !

రాధికా శ‌ర‌త్‌కుమార్ ని ఒక మాజీ హీరోయిన్ గానే ఆమె పరిధిని నిద్దారించలేం. రాధికా నటిగా హిట్, బిజినెస్ విమెన్ గా హిట్, టీవీ నటిగా నిర్మాతగా సూపర్ హిట్.. ఇన్ని హిట్స్ మధ్యలో ఆమెకు ఎందుకు ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి ? ఆమె అభిమానులను తీవ్రంగా కలిచివేస్తున్న ప్రశ్న ఇది. ఇంతకీ ఈ ప్రశ్నలో వాస్తవం ఎంత ఉందనే విషయాన్ని పక్కన పెడితే… మునపటి తెగువ, బుల్లితెర పై పట్టు రాధికలో ఇప్పుడు లేవు. వయసు […]

radhika sarathkumar
రాధికా శ‌ర‌త్‌కుమార్ ని ఒక మాజీ హీరోయిన్ గానే ఆమె పరిధిని నిద్దారించలేం. రాధికా నటిగా హిట్, బిజినెస్ విమెన్ గా హిట్, టీవీ నటిగా నిర్మాతగా సూపర్ హిట్.. ఇన్ని హిట్స్ మధ్యలో ఆమెకు ఎందుకు ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి ? ఆమె అభిమానులను తీవ్రంగా కలిచివేస్తున్న ప్రశ్న ఇది. ఇంతకీ ఈ ప్రశ్నలో వాస్తవం ఎంత ఉందనే విషయాన్ని పక్కన పెడితే… మునపటి తెగువ, బుల్లితెర పై పట్టు రాధికలో ఇప్పుడు లేవు.

వయసు పెరిగిన కారణం అని సరిపుచ్చలేం. ఆమె తలుచుకుంటే ఇప్పటికి రోజుకు రెండు సీరియల్స్ లో నటించగలదు. అంత కెపాసిటీ రాధికకు ఉంది. కానీ ఆమె మాత్రం స్పీడ్ తగ్గించింది. దీనికితోడు ఆ మధ్య చెక్ బౌన్స్ కేసులో రాధికా శ‌ర‌త్‌కుమార్ దంపతులకు ఏడాది శిక్ష‌ పడటం కూడా అందర్నీ షాక్ కి గురి చేసింది. అప్పట్లో ఈ వార్త తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిచ్చింది.

అయితే ఈ కేసు ఆ తర్వాత ఏమైందో తెలియదు గాని, రాధికా మాత్రం ప్రస్తుతం కొత్త సీరియల్ నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటుంది. ఇందుకు ఫండింగ్ కోసం ఆమె అప్పులు చేస్తోందట. రాధికా శ‌ర‌త్‌కుమార్ టాలీవుడ్‌లో కూడా ప్ర‌ముఖ న‌టిగా గుర్తింపు పొందింది, ఇక్కడ బుల్లితెరలో కూడా ఆమెకు కొంత మార్కెట్ ఉంది. పైగా ఆమె సక్సెస్ ఫుల్ నిర్మాత కూడా.

మరి ఆమె సంపాదించిన సొమ్ము అంతా ఏమైపోయింది ? రాధికా భ‌ర్త శ‌ర‌త్‌ కుమార్ కూడా త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హీరోగా చాల సినిమాలు చేశారు. పైగా శరత్ కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. దీనికి తోడు శరత్ కుమార్ రాజ‌కీయ నాయ‌కుడు కూడా. అయినా ఈ దంపతులు అప్పుల్లో ఎలా కురుకుపోయారో వారికే తెలియాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper