spot_img
Homeలైఫ్ స్టైల్Gold Prices Fall: బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? ఒక్కరోజే భారీగా పతనం..

Gold Prices Fall: బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? ఒక్కరోజే భారీగా పతనం..

Gold Prices Fall: బంగారం ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఒకరకంగా కొనుగోలు దారులకు ఇది పసిడి ప్రియులకే శుభ వార్తే అయినా.. వ్యాపారులు మాత్రం షాక్ అవుతున్నారు. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ కారణంగా కొనుగోళ్లు పెరుగుతున్నా.. ధరలు పడిపోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. గురువారం ఒక్కరోజే బంగారం ధరలు భారీగా పడిపోయాయి. మొన్నటి వరకు రూ.61,000ల మార్క్ ఉండే ధరలు ఒక్కసారిగా రూ.55,800కు దిగింది. వెండి సైతం రూ.76,500 మార్క్ ను టచ్ చేసింది. దీంతో ఈ ధరలు మరింత పడిపోతాయా? లేక పుంజుకుంటాయా? అనేది ఆసక్తిగా మారింది.

ఇంటర్నేషనల్ కమొడిటీస్ లో ధరలు పడిపోవడంతో బంగారం ధరలు పడిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ కమెడిటీల ధరలను పరిశీలిస్తే ఔన్స్ ధర 1957.60 డాలర్లతో ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ లోనూ ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. 2023 జూన్ ఫ్యూచర్స్ 0.24 శాతం అంటే రూ.143 తగ్గి రూ.59,711 వద్ద ట్రేడ్ అవుతోంది. గత 20 రోజులుగా బంగారం ధరలు డౌన్ ఫాల్ లోనూ ఉంటూ వస్తున్నాయి.

గురువారం నాటి బంగారం ధరలు పరిశీలిస్తే 22 క్యారెట్లు రూ.55,800 ట్రేడ్ అవుతోంది. నిన్నటి వరకు రూ.56,250 కొనసాగగా గురువారం రూ.450 తగ్గింది. మరోవైపు వెండి గురువారం ఏకంగా రూ.1000 తగ్గి రూ.77,500తో ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ లో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉండడంతో కొంతమంది కొనుగోలు దారులు బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

2022 నవంబర్ నుంచి మే 5 వరకు గోల్డ్ ప్రైస్ హైక్ లోనే ఉన్నాయి. గత నవంబర్ లో 22 క్యారెట్లు రూ.46,100 కు విక్రయించారు. మే 5 వరకు రూ.61000లకు చేరుకుంది. ఆరు నెలల్లో దాదాపు రూ.14 వేల వరకు పెరిగింది. అయితే మే 5 నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ 20 రోజుల్లో దాదాపు రూ.6000 వరకు తగ్గింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లోని మార్పుల కారణంగా ధరలు తగ్గుతున్నాయని, మరోసారి హైక్ ఉండే అవకాశం ఉందని కొందరు వ్యాపారులు అంటున్నారు.
Recommended Video:

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper