spot_img
Homeలైఫ్ స్టైల్Dream Of Romance: కలలో శృంగారం కలలు వస్తే దేనికి సంకేతం? ఏం జరుగుతుంది

Dream Of Romance: కలలో శృంగారం కలలు వస్తే దేనికి సంకేతం? ఏం జరుగుతుంది

Dream Of Romance: ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనితో ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటారు. దీంతో ఎన్నో రకాల ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ క్రమంలో శరీరం అలసిపోతుంది. అలసిపోయిన శరీరం రీఛార్జ్ కావడానికి సరైన నిద్రపోవాలి. మంచి నిద్రవల్ల శరీరంలో ఏదో తెలియని ఉత్సాహం ఉంటుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు నిద్రే సరైన ఎనర్జీ. అయితే నిద్ర పోతున్న సమయంలో కొందరు కలతతో ఉంటారు.మరికొందరు ప్రశాంతంగా ఉంటారు. ఈ క్రమంలో కొందరికి కలలు వస్తుంటాయి. కొన్ని కలలు ప్రశాంతతను చెడగొట్టి ఆందోళనకు గురిచేస్తాయి. మరికొన్ని కలలు హాయిని ఇస్తాయి. అయితే కొందరికి కలలో ఇతరులతో కలిసి శృంగారం చేసినట్లు వస్తుంది. ఇవి ఒకరకంగా హాయి అనిపించినా..మరోవైపు ఆందోళనను కలిగిస్తాయి. ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి? వీటి వల్ల లాభమా? నష్టమా? ఆ వివరాల్లోకి వెళితే..

శృంగారం ఆరోగ్య కరం. ఈ క్రియలో పాల్గొన్న సమయంలో మధురానుభూతి పొందుతారు. కొంతమంది పెళ్లయిన తరువాత జీవిత భాగస్వామితో కలిసి శృంగారం చేస్తారు. మరికొందరు మాత్రం పెళ్లికి ముందే ఇందులో పాల్గొంటారు. అయితే ఒక వ్యక్తికి తన కలలో మరొకరితో శృంగారం చేసినట్లు కల రావడం వల్ల ఆ వ్యక్తికి ఏదో తెలియని హాయితో పాటు ఆందోళన కూడా ఉంటుంది. ఇలాంటి కల రావడానికి బలమైన కారణం ఉంటుంది. కలలో ఎవరితో అయితే కలిసి ఉంటున్నారో.. ఆ వ్యక్తి మోహం కనిపిస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని కోరుకుంటున్నారని అర్థం. అంతేకాకుండా ఆ వ్యక్తిని మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారని అర్థం.

ఇలాంటి కల రావడం వల్ల మంచి సంకేతమే అవుతుంది. ఇలా కల వచ్చిందంటే వారిలో ఆత్మ విశ్వాసం పెరిగిపోతుంది. అలాగే ఆత్మ గౌరవంతో ఉండగలుగుతారు. అయితే కలలో వచ్చిన వ్యక్తితో శృంగారం చేయడానికి కుదరకపోయినా.. వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అప్పటి వరకు ఆ వ్యక్తి కష్టాలు ఎదుర్కొంటే అప్పటి నుంచి సంతోషంగా ఉండే అవకాశం ఉంది. తీవ్ర ఒత్తిడితో ఉన్న వారికి ఇలాంటి కలలు సానుకూలంగా ఉంటాయి.

కొందరికి కలలో శృంగారం చేస్తున్నట్లు కాకపోయినా చెంపపై ముద్దు పెట్టినట్లు వస్తుంది. ఇలాంటి కల వచ్చిందంటే వారి జీవితంలో శుభ సంకేతాలు వెలువడుతాయని అర్థం. ఎవరైతే చెంపపై ముద్దు పెడుతారు. వారు తమ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వ్యక్తిపై సదరు వ్యక్తికి ఎక్కువగా ఇష్టం ఉండడం వల్లే ఇలా ముద్దు పెట్టినట్లు కల వస్తుంది. చెంపపై ముద్దు పెట్టే కల రావడం వల్ల ఆర్థికంగానూ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పెళ్లయిన తరువాత శృంగారం కలలు వస్తున్నాయంటే జీవిత భాగస్వామితో బంధం ఏర్పడుతుందని అర్థం. ఇలాంటి సమయంలో పార్ట్ నర్ తో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. వారితో సరదగా ఉండడం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది. ఆ తరువాత మరింత ప్రేమగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఏదైనా పని మొదలుపెట్టేమందు ఇలాంటి కలలు వస్తే వారు అందులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper