Life Style: జీవితంలో సంతోషంగా ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అయితే సంతోషం అనేది ఒకరితో రాదు. సమాజంలో ఉన్న బంధువులు, మిత్రులు, స్నేహితులతో కలిసి ఆనందంగా ఉన్నప్పుడే మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయితే అందరూ ఒకేలా ఉండరు. కొందరితో స్నేహం చేయడం వల్ల హ్యాపీగా ఉండగలుగుతారు. మరికొందరితో కాసేపు ఉన్నా.. మనసు ఆందోళనగా ఉంటుంది. అయితే ఒక్కసారి మనకు తెలియకుండానే కొందరితో స్నేహం చేయాల్సి వస్తుంది. వారితో కలిసి ఉన్నా.. కలిసి మాట్లాడినా.. అవమానాలకు గురికావాల్సి వస్తుంది. అందుకే కొన్ని ప్రదేశాలకు అస్సలు వెళ్లకుండా ఉండాలి. అలాంటి ప్రదేశాలు ఏవంటే?
Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
లైఫ్ లో అందరూ ఒకేసారి విజయం సాధించరు. కానీ మన ఇండియాలో మాత్రం ఎక్కువ శాతం ఒకరి ఎదుగుదల చూసి మరొకరు ఓర్వలేక పోతుంటారు. ఇలాంటి వ్యక్తులు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. అయితే కొందరు తో మాత్రం పక్కనే ఉంటూ చెడగొడుతూ ఉంటారు. అంటే ఒకరి గ్రోత్ చూసి ఓర్వ లేనివారు.. వారి గురించి చెడుగా చెప్పే వారి గురించి పట్టించుకోకుండా ఉండడమే మంచిది. అంతేకాకుండా వారితో స్నేహం చేయడానికి అస్సలు ఒప్పుకోవద్దు. ఇలాంటి వారితో ఉండడంవల్ల ఎప్పటికైనా నష్టమే జరుగుతుంది.
ఇళ్లలోకి వెళ్ళినప్పుడు గౌరవ మర్యాదలు, ఆప్యాయతలతోనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొందరు ఇళ్లల్లోకి వెళ్లినప్పుడు వారు పట్టించుకోరు. ముఖ్యంగా వారి పిల్లలు అగౌరపరుస్తూ.. మర్యాద ఇవ్వకపోతే వారి ఇంటికి వెళ్లడం మంచిది కాదు. వారు అలా గౌరవం ఇవ్వడం లేదంటే.. మీ గురించి వారికి వారి తల్లిదండ్రులు ఏదో చెడుగా చెప్పే ఉంటారు. అందుకే మిమ్మల్ని చూసినా పెద్దగా పట్టించుకోరు. అలాంటి వారి ఇంటికి వెళ్లడం గానీ.. స్నేహం గాని చేయొద్దు.
ప్రతి వ్యక్తికి డబ్బు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం. ఆత్మగౌరవం లేకుంటే ఏ పని సాటిస్ఫాక్షన్ అనిపించదు. అందుకే మనకు గౌరవం లేని చోట కలిసి తినకుండా ఉండడమే మంచిది. ముఖ్యంగా కొందరు అవమానించేవారు.. ఎప్పుడు దూరంగా ఉండే వారితో కలిసి తినకుండా ఉండాలి. ఎందుకంటే ఆహారం కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకేమీ ఉండదు. ఇది ప్రశాంతమైన వాతావరణంలో మాత్రమే తీసుకోవాలి.
చాలామంది పైకి బాగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో గౌరవం ఇవ్వరు. ముఖ్యంగా కొంతమంది గ్రూపులో ఉన్నవారు చిన్నచూపు చూస్తారు. ఇలాంటి వారి వద్దకు అసలు వెళ్ళద్దు. ఇక్కడికి వెళ్లడం ద్వారా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవసరమైతే ఒంటరిగా ఉండండి.. కానీ ఇలాంటి గ్రూపులతో స్నేహం చేయకుండా ఉండడమే మంచిది.
కొంతమంది మాటలతో తీవ్ర ఆవేదనకు గురి చేస్తూ ఉంటారు. వారు పడే మాటలతో ఒక్కోసారి ప్రాణమే పోయినట్లు అవుతుంది. ఇలాంటి వారితో అసలు స్నేహం చేయకుండా ఉండాలి. ముఖ్యంగా ఎదుటివారిని హేళనకు గురి చేసే వారితో స్నేహం చేస్తే జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.