Bumper Opportunity: పదవి విరమణ తర్వాత ఎలా జీవితం గడపాలో అని చాలామంది చింతిస్తూ ఉంటారు. అయితే ఉద్యోగంలో ఉన్న సమయంలోనే కొన్ని ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు పదవి విరమణ తర్వాత కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా జీవితం కొనసాగించవచ్చు.
పదవి విరమణ తర్వాత కూడా ప్రతి నెల ఆదాయము పొందవచ్చు. పదవి విరమణ తర్వాత సీనియర్ సిటిజన్స్ కి ఆర్థిక భరోసాగా నిలిచే అనేక పథకాలలో పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సీనియర్ సిటిజెన్స్ స్కీం కూడా ఒకటి. ఈ స్కీం ద్వారా మీరు ప్రతి నెల పదవి విరమణ తర్వాత రూ.30,000 ఆదాయం పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్స్ కోసం అందిస్తున్న ఈ అద్భుతమైన పథకం ద్వారా మీరు నెల నెల మంచి ఆదాయము పొందవచ్చు. ఈ స్కీము మీకు పదవి విరమణ తర్వాత కూడా ఆర్థిక భరోసాను ఇస్తుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ లో సీనియర్ సిటిజన్స్ కోసం మంత్లీ ఇన్కమ్ స్కీం కూడా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పథకాలలో మీకు గ్యారెంటీగా 100% రాబడి ఉంటుంది.
Read Also: గులాబీ మొక్క మొగ్గలు వేయడం లేదా? మొగ్గలు రాలిపోతున్నాయా?
అయితే ఇవి ప్రభుత్వ భరోసాతో ఉన్న పథకాలు కాబట్టి మీ డబ్బులు ఈ పథకాలలో చాలా సురక్షితంగా ఉంటాయి. పదవి విరమణ తర్వాత నెల నెల ఆదాయం పొందడానికి మీకు ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం హామీతో ఉన్న ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో మీరు ఎక్కువ వడ్డీ కూడా పొందవచ్చు. దీని మెచ్యూరిటీ సమయం ఐదేళ్లు ఉంటుంది. ఐదేళ్లు పూర్తయిన తర్వాత మీరు ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్ లో ఉన్న సీనియర్ సిటిజన్ స్కీం లో మీకు డిపాజిట్ చేసే పరిమితి రూ.30 లక్షల వరకు ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ వారు సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం లో 8.2% వడ్డీ రేటును అందిస్తున్నారు. మీరు ఈ పథకంలో రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లయితే వడ్డీతో కలిపి మీరు ఐదు ఏళ్లకు ప్రతి నెల రూ.20,050 అందుకోవచ్చు.
అంటే ఒక ఏడాదికి మీకు రూ.2,40,600 వస్తాయి. పోస్ట్ ఆఫీస్ వారు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో 7.4% వడ్డీ రేటును అందిస్తున్నారు. ఒకవేళ మీరు ఈ పథకంలో రూ.15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ప్రతినెల కూడా క్రమం తప్పకుండా రూ.9,250 వడ్డీ పొందుతారు. అంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో మీరు ఏడాదికి రూ.1,11,000 పొందుతారు. మీరు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం లో ప్రతినెలా వడ్డీ రూ.20,050, అలాగే జీవిత భాగస్వామితో ప్రతినెలా వడ్డీ రూ.9250 పొందినట్లయితే మీరు మొత్తంగా ప్రతి నెల రూ.30,000 పొందవచ్చు.