Treadmill Workout Duration For Beginners: ట్రెడ్ మిల్.. ఔట్ డోర్ లో వ్యాయామం చేయలేనివారు.. దీనిని ఉపయోగించుకుంటారు.. ఒకప్పుడు సంపన్న వర్గాలు మాత్రమే ట్రెడ్ మిల్ వాడేవారు. ఇప్పుడు వర్గాల వారికి ట్రెడ్ మిల్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో కూడా రకరకాల మోడల్స్ తెర పైకి రావడంతో చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు. ట్రెడ్ మిల్ మీద నడవడం ద్వారా చాలామంది తమ శరీరంలో ఉన్న అదనపు కేలరీలను బర్న్ చేసుకుంటారు. ట్రెడ్ మిల్ నడుస్తుంటే పాదాలు గట్టి పడతాయి.. ఎముకలు దృఢత్వాన్ని పొందుతాయి.
ట్రెడ్ మిల్ తొలిసారి వాడుతున్నవారు 20 నుంచి 30 నిమిషాల వరకు నడవాలని నిపుణులు చెబుతున్నారు. వారానికి నాలుగు నుంచి ఐదు సెకండ్ల పాటు ఆ వేగం ఉండేలా చెబుతున్నారు.. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. క్యాలరీలు కరిగిపోతాయి. గుండె పనితీరు మెరుగుపడినప్పుడు రక్తప్రసరణ కూడా బాగుంటుంది. రక్తప్రసరణ సక్రమంగా ఉన్నప్పుడు.. శరీర అవయవాలకు రక్త సరఫరా మెరుగ్గా జరుగుతుంది.. ట్రెడ్ మిల్ వేగాన్ని క్రమంగా 40 నుంచి 60 నిమిషాలకు పెంచుకుంటే.. శరీరానికి సరిపడా వ్యాయామ లభిస్తుంది. అయితే ఈ స్థిరత్వాన్ని ఎప్పటికీ కొనసాగించాలి. క్రమం తప్పకుండా 20 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఆ ప్రభావం శరీరం మీద తప్పకుండా ఉంటుంది.. దానివల్ల అదనపు క్యాలరీలు కరిగిపోతాయి.. దీనికి తోడు శరీరం ఉత్తేజంగా మారుతుంది.
ట్రెడ్ మిల్ తొలిసారి ఉపయోగించేవారు ఒకేసారి వేగాన్ని పెంచుకుంటే.. ఆ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మొదట్లో వేగాన్ని పెంచిన తర్వాత.. మధ్యలో తగ్గిస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిరమైన వేగాన్ని కొనసాగించకపోవడం వల్ల ఎముకల దగ్గర నొప్పి కలుగుతుంది. ఆ నొప్పి దీర్ఘకాలంలో రకరకాల సమస్యలకు దారితీస్తుంది. గుండె పనితీరులో కూడా మార్పులు రావడం వల్ల.. అది మరిన్ని అవరోధాలకు దారి తీయవచ్చు. అందువల్ల ట్రెడ్ మిల్ తొలిసారి ఉపయోగిస్తున్నప్పుడు నిర్ణీతమైన వేగాన్ని మాత్రమే కొనసాగించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా వేగాన్ని పెంచి.. ఆ తర్వాత తగ్గిస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటుంది. శరీరం మీద ఒత్తిడి పెరిగిపోతుంది.
ట్రెడ్ మిల్ తొలిసారి వాడేవారు కేవలం 20 నుంచి 30 నిమిషాల పాటు నడిస్తే సరిపోతుంది. సెషన్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అవి నాలుగు నుంచి ఐదు మించకూడదు. శరీరంలో క్యాలరీలు తగ్గాలంటే ఏ మాత్రం ఉండాలి. కొందరు ఏకాఏకిన క్యాలరీలు తగ్గాలని భావిస్తుంటారు. వేగాన్ని పెంచుకుంటారు. సెషన్ విషయంలో కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. దానివల్ల శరీరం రకరకాల మార్పులకు గురవుతూ ఉంటుంది. ముఖ్యంగా పాదాలు.. ఎముకల దగ్గర నొప్పి కలుగుతుంది. వృద్ధులు.. మధ్య వయసు ఉన్నవారు సాధ్యమైనంత వరకు ట్రెడ్ మిల్ వాడే విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
గుండె జబ్బులతో బాధపడుతున్నవారు.. ఆర్థో సమస్యలతో బాధపడుతున్నవారు.. ట్రెడ్ మిల్ ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండాలి. షూ విషయంలో కూడా నిపుణుల సలహాలు పాటించాలి. ఎందుకంటే స్పోర్ట్స్ షూ లో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో ట్రెడ్ మిల్ కు అనుకూలంగా ఉండే షూ మాత్రమే వాడాలి. యాంకిల్ పటిష్టంగా ఉండాలి. పాదం స్వేచ్ఛగా కదలకలగాలి. అప్పుడే ట్రెడ్ మిల్ మీద పటిష్టంగా నడిచేందుకు ఆస్కారం ఉంటుంది.
Desclaimer : ఇది కేవలం అవగాహనకోసం మాత్రమే. ఓకేతెలుగు దీన్ని నిర్ధారించదు. డాక్టర్ సలహాలపైనే మీరు ముందుకుసాగండి.