https://oktelugu.com/

 Hide Your Age :  మీ వయసును దాచిపెట్టే అద్భుతమైన ఫుడ్స్ ఇవే..

రొటీన్ డైట్ మాత్రమే కాకుండా వాటితో పాటు మరికొన్ని ఆహారాలను మీ డైట్ లో చేర్చుకుంటే వయస్సు పెరుగుతున్నప్పటికీ చర్మం బిగుతుగా ఉంటుంది. దీంతో శరీరం కూడా ఫిట్‌గా మారుతుంది. ఆహారంతో పాటు, వ్యాయామం, నిద్ర, చాలా అవసరం. మీరు తీసుకునే ఆహారం మీ యవ్వనాన్ని కాపాడుతుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే చదివేసేయండి.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 14, 2024 / 06:31 AM IST

     Hide Your Age Food

    Follow us on

    Hide Your Age :  అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అందరికీ సాధ్యం కాదు. కొందరు వయసు పెరుగుతున్నా సరే యవ్వనంగా కనిపిస్తుంటారు. అయితే ఈ వృద్ధాప్యాన్ని ఎవరు ఆపలేరు. వృద్ధాప్య సంకేతాలు చర్మం, ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంటాయి. చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గితే చాలా సమస్యలు వస్తాయి. దీని వల్ల చర్మం వదులుగా మారడం, ముడతలు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి. దీనితో పాటు ఆరోగ్యంలో కూడా ఇబ్బంది పెడుతుంటుంది. త్వరగా అలసిపోవడం, బరువు పెరగడం, కీళ్ళు – కండరాలలో నొప్పి… వంటివి వృద్ధాప్యాన్ని ఆపలేవు. కానీ ఈ లక్షణాలను చాలా వరకు నియంత్రించవచ్చు అంటున్నారు నిపుణులు. రొటీన్ డైట్ మాత్రమే కాకుండా వాటితో పాటు మరికొన్ని ఆహారాలను మీ డైట్ లో చేర్చుకుంటే వయస్సు పెరుగుతున్నప్పటికీ చర్మం బిగుతుగా ఉంటుంది. దీంతో శరీరం కూడా ఫిట్‌గా మారుతుంది. ఆహారంతో పాటు, వ్యాయామం, నిద్ర, చాలా అవసరం. మీరు తీసుకునే ఆహారం మీ యవ్వనాన్ని కాపాడుతుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే చదివేసేయండి.

    నానంబెట్టిన బాదం
    నానబెట్టిన బాదంతో మీ రోజును ప్రారంభించాలి. మూడు నుంచి నాలుగు బాదంపప్పులు, వాల్‌నట్‌లను నానబెట్టి ఉదయాన్నే తినాలి. వాటిలోని విటమిన్ ఇ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఈ గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తుంది.

    సిట్రస్‌ పండ్లు
    వయసు పెరిగే కొద్దీ యవ్వనంగా ఉండాలంటే, మీ ఆహారంలో తప్పనిసరిగా యాపిల్ ఉండాలి అంటున్నారు నిపుణులు. ఇది గుండెకు చాలా ఉపయోగం. ఎముకలను ఆరోగ్యంగా ఉంచే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనితోపాటు ఆహారంలో బెర్రీలు, అవకాడో, ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష, కివీ వంటి సిట్రస్ పండ్లను చేర్చుకోవడం కూడా చాలా అవసరం. వీటిల్లో విటమిన్ సి, ఇ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

    పాలు
    వయసు పెరిగే కొద్దీ కండరాలు, ఎముకలు దృఢంగా ఉండాలి. ఎముకల దృఢత్వం కోసం పాలు అవసరం. కీళ్ల నొప్పులు మొదలైన వాటిని నివారించాలంటే రోజూ ఒక గ్లాసు పాలను తీసుకోండి. బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతుంటే కొవ్వు లేని పాలు ఎంచుకోవచ్చు.

    కొల్లాజెన్ కాఫీ
    కాఫీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.అంతేకాదు వృద్ధాప్య సమస్యలతో కూడా పోరాడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే, కొల్లాజెన్ కాఫీని తాగాలి అంటున్నారు నిపుణులు. కాఫీలో ఒక స్పూన్‌ కొల్లాజెన్ పౌడర్‌ని కలిపి తాగడం వల్ల మంచి ఫలితాలుఉంటాయి. ఒక వేళ మీరు శాకాహారి అయితే, బాదం పాలతో కొల్లాజెన్ కాఫీని తయారు చేసుకోండి. మరో ముఖ్యమైన విషయం.. రెగ్యులర్ కొల్లాజెన్ కాఫీని తీసుకోవాలనుకుంటే, ముందుగా వైద్యుడిని సంప్రదించాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..