Health Tips: : ఫోన్, లాప్, టీవీలు మీ అందాన్ని కూడా పాడు చేస్తున్నాయి? ఎలాగంటే?

కండ్లకు మాత్రమే కాదు చర్మానికి తీవ్ర హానికరమని అంటున్నాయి చాలా వార్తలు. మరి ఈ వార్తల్లో నిజమెంత? అసలు బ్లూ లైట్ కండ్లను మాత్రమే కాకుండా మన చర్మాన్ని దెబ్బతీస్తుందా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By: Neelambaram, Updated On : October 13, 2024 9:52 pm

Blue light Effect

Follow us on

Health Tips:  టెక్నాలజీ ఏ రేంజ్ లో మానవాళికి ఉపయోగపడుతుందో అదే రేంజ్ లో ఇబ్బందిని కూడా కలగజేస్తుంది. చాలా మంది దినచర్యలో ఫోన్లు, కంప్యూటర్లు వంటి గ్యాడ్జెట్స్ అధికంగా వాడటం కచ్చితంగా ఉంటుంది. అంటే వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ మన చర్మానికి హానికరం అయినా సరే వాటికి దూరంగా ఉండటం లేదు. కండ్లకు మాత్రమే కాదు చర్మానికి తీవ్ర హానికరమని అంటున్నాయి చాలా వార్తలు. మరి ఈ వార్తల్లో నిజమెంత? అసలు బ్లూ లైట్ కండ్లను మాత్రమే కాకుండా మన చర్మాన్ని దెబ్బతీస్తుందా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లూ లైట్ అంటే ఏమిటి?
దృశ్యమాన కాంతి వర్ణపటంలో ఒక భాగమే బ్లూ లైట్. దీనికి ప్రధాన వనరు సూర్యకాంతి అంటున్నారు నిపుణులు. ప్రతి రోజు చాలా మంది ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లైన టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు సహా పలు ఎలక్ట్రానిక్స్ బ్లూ లైట్ ను ఉత్పత్తి చేస్తుంటాయి. సూర్యుడి కంటే 100–1,000 రెట్లు తక్కువ స్థాయిలో బ్లూ లైట్ ఉన్నప్పటికీ ఇది మనకు తవ్ర నష్టం కలిగిస్తుందని వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌ గ్యాడ్జెట్స్ ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మన చర్మాన్ని కూడా బ్లూ లైట్ ప్రభావితం చేస్తుంది.

బ్లూ లైట్ చర్మ వర్ణద్రవ్యాన్ని పెంచుతుంది

పలు వైద్య అధ్యయనాల ప్రకారం బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ మెలనిన్ సంశ్లేషణను వేగవంతం చేస్తుంది. ఇది హైపర్‌పిగ్మెంటేషన్‌కు దారితీస్తుంది. మెలనిన్ అధిక ఉత్పత్తి కారణంగా చర్మం నల్లగా మారుతుంది. ఇది మరింత ఎక్కువ అవుతున్న సమయంలో చర్మంపై నల్లని మచ్చలు కూడా ఏర్పడతాయి.

బ్లూ లైట్ వల్ల చర్మం ముడతలు వస్తాయి
కొన్ని అధ్యయనాల ప్రకారం బ్లూ లైట్ చర్మ నిర్మాణానికి ముఖ్యమైన ప్రోటీన్ అయిన కొల్లాజెన్‌కు నష్టం కలిగించే అవకాశముంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అయితే మీరు మీ ఎలాక్ట్రానిక్స్ ను ఒక గంట పాటు ఒక అంగుళం దూరంలో ఉంచి వాడితే ఈ ప్రమాదం అధికంగా ఉంటుంది. అంటే మీరు బ్లూ లైట్ ను ప్రసరింపజేసే ఫోన్, ల్యాప్ టాప్ లను అధికంగా ఉపయోగిస్తుంటే త్వరలోనే వృద్ధాప్యం వస్తుంది అన్నమాట.

బ్లూ లైట్ నిద్రను దెబ్బతీస్తుంది ..
బ్లూ లైట్ చర్మంతో పాటు కళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కళ్ళ చుట్టూ ఉబ్బిన లేదా మసకబారినట్టు అనిపిస్తుంటే దీనికి కారణం బ్లూ లైట్ అని అనుమానించాలి అంటున్నారు నిపుణులు. బ్లూ లైట్ మీ నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. మనిషికి సరిపడా నిద్ర లేకపోయినా సరే ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుంది. నిద్ర లేమి లక్షణాలు చర్మంలో కనిపిస్తాయి. చర్మం త్వరగానే ముడుతలు పడటం ప్రారంభం అవుతుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..