Site icon OkTelugu

Mention House Mallesh Movie Trailer: మెన్షన్ హౌజ్ మల్లేష్ కి మ్యాటర్ లేదా..? గత్తర లేపుతున్న ట్రైలర్…

Mention House Mallesh Movie Trailer

Mention House Mallesh Movie Trailer

Mention House Mallesh Movie Trailer: తెలంగాణ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలంగాణ సినిమాల హవా ఎక్కువైపోయింది. నాని చేసిన ‘దసర’ సినిమా కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే సాగడం విశేషం… ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో చాలా సినిమాలు అదే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు చిన్న చిన్న పాత్రలను చేసిన శ్రీనాథ్ మాగంటి హీరోగా చేస్తున్న ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ సినిమా ఈనెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే దానికి సంబంధించి ఈ సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే తెలంగాణ నేపథ్యంలో ఉన్న ఒక ఊరు లో ఈ స్టోరీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ట్రైలర్ మొత్తం కామెడీ తో పాటు చిన్న సెంటిమెంటు ఎమోషనల్ సన్నివేశాలతో సాగింది. మరి మెన్షన్ హౌస్ తాగడం వల్ల మల్లేష్ కి పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెబుతాడు. దాంతో అతన్ని చాలామంది కామెంట్లు చేస్తారు.

Also Read: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

మొత్తానికైతే ఆయనకి పిల్లలు పుట్టారా? లేదా అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా తెరకెక్కినట్టుగా తెలుస్తుంది. మల్లేష్ గా నటించిన శ్రీనాథ్ మాగంటి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ట్రైలర్ మొత్తం చాలా ఎఫెక్టివ్ గా అనిపించింది. మార్చి 6వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా సైతం సక్సెస్ ని సాధించే విధంగానే కనిపిస్తుంది…

మెన్షన్ హౌస్ మల్లేష్ లో మ్యాటర్ ఉందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మార్చి 6వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే… తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరచడం లేదు. ఇక ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ అనగానే సగం సినిమా అక్కడే సక్సెస్ సాధిస్తుంది.

ఇక తెలంగాణ అంటే మందు విందు లాంటివి కాకుండా ఇంకేదైనా కొత్తగా చూపిస్తే బాగుంటుందని మరికొంతమంది భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కొత్త పాయింట్ ఏదైనా టచ్ చేసారా? లేదా ట్రైలర్లు చూపించింది కాకుండా ఇంకేదైనా స్టోరీని హోల్డ్ చేసి పెట్టారా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

 

Exit mobile version