Homeక్రీడలుIndia vs Pakistan Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. గెలుపు ఎవరిదంటే

India vs Pakistan Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. గెలుపు ఎవరిదంటే

India vs Pakistan Asia Cup: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పట్ల అంచనాలు పెరుగుతున్నాయి. ప్రేక్షకుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. పదిహేను రోజుల ముందే అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏది ఫేవరేట్ అని అందరు ఆలోచిస్తున్నారు. కొందరు ఇండియానే ఫేవరేట్ అంటే మరికొందరు పాక్ ఫేవరేట్ అని చెబుతుండటం విశేషం. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా పటిష్టంగా ఉండటంతో విజయం తమదేనని దీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో అటువైపు నుంచి కూడా తామే కప్ సాధిస్తామని పాక్ జట్టు కూడా ప్రచారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈనెల 28న దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ కోసం అందరు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

India vs Pakistan Asia Cup
India vs Pakistan Asia Cup

ఆటంటే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అయితేనే మజా వస్తుంది. అందుకే ఈ మ్యాచ్ పై అందరిలో ఒకటే ఉత్సుకత ఏర్పేడింది. ఇప్పటి నుంచే తమదే ఆధిపత్యం అంటే తమదే విజయం అంటూ రెండు జట్ల అభిమానులు ఇప్పటి నుంచే సవాలు చేసుకుంటున్నారు. దీంతో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై అందరిలో ఆసక్తి ఏర్పడుతోంది. 28న జరిగే మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుందోననే అనుమానాలు అందరిని తొలుస్తున్నాయి. దీనిపై పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు.

Also Read: Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రివ్యూ.. ఈ కొత్త బుల్లెట్ బండి అసలు సంగతి ఇదే !

ఆస్ర్టేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా, పాకిస్తాన్ జట్లలో ప్రస్తుతం ఇండియా ఫేవరేట్ గా ఉందని తెలుస్తోంది. జట్టు సమష్టిగా రాణిస్తోంది. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ కంటే ఇండియానే ఫేవరేట్ అని చెబుతున్నాడు. తాను కూడా ఇండియాకే ఓటు వేస్తున్నట్లు తన మనసులోని మాటను వెలిబుచ్చాడు. దీంతో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. జట్టు విజయంపై ఎవరి ధైర్యం వారికి ఉండనుంది.

India vs Pakistan Asia Cup
India vs Pakistan Asia Cup

ఈ సంవత్సరం 21 మ్యాచులు ఆడిన టీమిండియా 17 మ్యాచుల్లో విజయం సాధించడం గమనార్హం. కెప్టెన్లు మారిని విజయాలు మాత్రం మారలేదు. చక్కగా విజయాలు దక్కించుకుంది. ఆటగాళ్ల సమష్టి తత్వం వారి విజయంలో ప్రముఖ పాత్ర పోషించిందని చెబుతున్నాడు. ఇలా రికీ పాంటింగ్ తన మనసులోని మాటను వ్యక్తం చేయడంతో ఇక పాకిస్తాన్ కు భంగపాటు తప్పదా అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఆసియా కప్ ను సొంతం చేసుకోవడమే టీమిండియా లక్ష్యంగా కనిపిస్తోంది.

Also Read:Chanakya Niti: చాణక్య నీతి: ఎలాంటి చోట ఇల్లు కట్టుకోవద్దో తెలుసా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular