Jobs: నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సీనియర్ రెసిడెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. మొత్తం 5 ఉద్యోగ ఖాళీలు ఉండగా సీనియర్ రెసిడెంట్ పోస్టులు 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2 ఉన్నాయని సమాచారం అందుతోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.80,000 నుంచి రూ.1,30,000 వరకు వేతనంగా చెల్లిస్తారని సమాచారం అందుతోంది. అనెస్తీషియాలజీ, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మెడికల్ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు మాత్రమే సీనియర్ రెసిడెంట్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రేడియో డయాగ్నసిస్‌లో మెడికల్ పీజీ (ఎండీ/డీఎన్‌బీ) పాసైన వాళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కు అర్హత కలిగి ఉంటారు.
ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఏప్రిల్ 11, 2022న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలకు ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డీన్, నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), పంజాగుట్ట, హైదరాబాద్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. https://www.nims.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.