Anchor Anasuya: సెలబ్రిటీలపై ఎన్ని ప్రశంసలు వస్తాయో.. అన్నే రూమర్లు, పుకార్లు, కామెంట్లు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా సమాజంలో ఉన్న కొన్ని రూల్స్ అనేవి అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అంటూ సెలబ్రిటీలకు నెటిజన్ల నుంచి విమర్శలు వస్తుంటాయి. ఇలా చాలామంది నెటిజన్ల ట్రోలింగ్‌కు గురవుతున్న వారు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఎక్కువగా ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటోంది.
ఆమె జబర్ధస్త్ నుంచి యాంకర్ గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. అనేక షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ అమ్మడుకు ఈ మధ్య సినిమాల్లో విపరీతంగా ఆఫర్లు వస్తున్నాయి. మొన్న పాన్ ఇండియా సినిమా పుష్పలో కీలక పాత్ర అయిన దాక్షాయణి ఈమెనే చేసింది. ఆ తర్వాత కూడా చాలానే ఆఫర్లు వస్తున్నాయి.
దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు 🙏🏻🙂 https://t.co/Uy4P00bmAE
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2022
ఇది పక్కన పెడితే.. ఆమె బుల్లితెరపై యాంకరింగ్ చేసే క్రమంలో ఆమె వేసుకునే బట్టలపై చాలా కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె పొట్టి బట్టలు వేసుకోవడంపై చాలానే కామెంట్లు వస్తున్నాయి. ఇద్దరు పిల్లల తల్లి అయి ఉండి ఇవేం బట్టలు, ఇలా ఎక్స్ పోజ్ చేయడమెందుకని ఆమెను సోషల్ మీడియాలో చాలామంది ట్రోల్ చేస్తుంటారు. కానీ అవేమీ అనసూయ పట్టించుకోదు.
కాగా ఓ నెటిజన్ ఇప్పుడు ఆమె మీద వివాదాస్పద కామెంట్ చేశారు. అయితే దీనికి అనసూయ కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా ఆమె మీద పోస్ట్ చేశాడు. అనసూయ గారు మీరు ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా ఇలాంటి పొట్టి బట్టలు వేసుకోవడం దేనికి, మీ వల్ల తెలుగు ఆడపడుచుల పరువు పోతోంది అంటూ రాసుకొచ్చాడు. అయితే అతని ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో షేర్ చేసింది అనసూయ.

దానికి ఆమె తన ట్వీట్ ను జత చేసింది. మీ పని మీరు చేసుకుంటే మంచిదని, నా పని నన్ను చేసుకోనివ్వండి అంటూ కౌంటర్ వేసింది. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీయొద్దు అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది. కాగా ఆమె ట్వీట్‌కు చాలామంది సపోర్టుగా వస్తున్నారు.
[…] […]