Life Style : ప్రతి ఒక్కరికి జీవితంలో పైకి ఎదగాలని ఉంటుంది. అందరితో సమానంగా డబ్బు సంపాదించి సంతోషంగా జీవించాలని కోరుకుంటారు.. కానీ కొందరు మాత్రమే డబ్బు సంపాదించి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. అయితే వారు ప్రత్యేకమైన అలవాట్లను కలిగి ఉండి.. కొన్ని దురాలవాట్లను దూరం చేసుకోవడం వల్లనే అనుకున్నది సాధించగలుగుతారు. ఆ తర్వాత కష్టపడి పని చేస్తారు. డబ్బు సంపాదించడానికి ఆదాయ మార్గాలు దొరకడమే కాకుండా మనిషిలోని కొన్ని గుణాలను కలిగి ఉండడం వల్ల జీవితంలో పైకి ఎదుగుతారు. ఇదే సమయంలో కొన్ని అలవాట్లను మానుకోవడం చేయాలి. అలా చేయకపోతే ఇంత డబ్బు సంపాదించినా పేదవారిగానే మిగిలిపోతారు. అలా దూరం పెట్టే అలవాట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
Also Read : ఇంట్లో మొక్కలను పెంచుతున్నారా? వీటిని తప్పకుండా ఉంచండి..
కొందరు డబ్బు సంపాదించడానికి ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. తాత్కాలికంగా డబ్బు సంపాదించడానికి చేతికి వచ్చిన పనిని చేస్తూ పోతారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోకుండా ఇష్టం వచ్చినట్లు పనిచేయడం వల్ల అది ఎప్పటికైనా అనర్ధమే. ఎందుకంటే జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసం పనిచేసుకుంటూ పోతే ఎప్పటికైనా దానిని సాధించి అధికంగా డబ్బు సంపాదించి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటూ.. తాత్కాలికంగా డబ్బు సంపాదించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.అందువల్ల జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసం కష్టపడుతూ ఉండాలి.
పనులు అందరూ చేస్తారు. కానీ కొందరు మాత్రమే జీవితంలో ఎదుగుతారు. వీరిని చూసి ఇతరులు అసూయపడతారు. అయితే అయితే కొన్ని రిస్కులు తీసుకోకుండా ఉండటంవల్ల వీరు అక్కడే ఉండిపోతారు. మిగతావారు మాత్రం రిస్కులు తీసుకొని ఎక్కువ పనులు చేస్తారు. ఉదాహరణకు కొందరు ఉద్యోగులు తాము చేసే పరికంటే అదనంగా కొన్ని పనులు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. ఇలా తక్కువ సమయం లో ఎక్కువ ఆదాయాన్ని పొందుతూ జీవితంలో ఉన్నత స్థాయికి వెతుకుతారు. కానీ మరికొందరు మాత్రం అలా చేయకుండా వచ్చిన డబ్బుతో సరిపెట్టుకుంటూ ఉండాలని అనుకుంటారు. ఇలాంటి లక్షణం ఉన్నవారు జీవితంలో ఎప్పటికైనా పైకి ఎదగలేరు.
నేటి కాలంలో చాలామంది చేసే ప్రధాన తప్పు ఏంటంటే ఆదాయానికి మించిన ఖర్చులు చేయడం. తక్కువ ఆదాయం వచ్చి ఎక్కువ ఖర్చులు చేయడం వల్ల ఎప్పటికైనా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లలేరు. అందువల్ల దుబార ఖర్చులను ఎక్కువగా చేయకుండా తక్కువ ఖర్చు చేస్తూ మిగిలిన డబ్బులు పొదుపు చేస్తూ పోవాలి. ఇలా చేయడం వల్ల తొందర్లోనే అనుకున్న స్థాయికి వెళ్తారు.
వ్యక్తిగతంగా కొందరు చాలామంది తమ అభివృద్ధి గురించి ఎక్కువగా పట్టించుకోరు. మాటలను అదుపులో ఉంచుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అలా చేయడంవల్ల సమాజంలో గుర్తింపును కోల్పోతారు. దీంతో ఇతరుల సహాయం పొందకుండా ఉంటారు. అయితే ఇలా కాకుండా మంచి మాటలతో అందరినీ ఆకట్టుకోవాలి. అప్పుడే ఇతరుల సహాయంతో అభివృద్ధిని సాధించగలరు.
Also Read : ఈ లోహాలు మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులే!