Metals : కేవలం బంగారం, ప్లాటినం, డైమండ్ మాత్రమే విలువైనవి అని చాలా మంది అంటుంటారు. కానీ వీటి కంటే విలువైనవి చాలానే ఉన్నాయి. మీ దగ్గర ఈ లోహాలు ఉంటే మాత్రం తప్పకుండా మీరు కూడా కోటీశ్వరులు అయినట్లే. ఎందుకంటే వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లోహాల్లో ఇవి కూడా ఒకటి. అయితే ఏయే లోహాలు మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులు అవుతారో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read : ఫ్యాక్టరీలపై గుండ్రంగా ఉండే ఈ స్టీల్ చక్రాలను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా?
బంగారం
బంగారం చాలా విలువనైది. దీని ధర అయితే రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. బంగారం ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వారు కోటీశ్వరులు అయినట్లే. ఎందుకంటే తులం బంగారం 90 వేల పైనే దాటింది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంది. మీ దగ్గర బంగారం ఎక్కువగా ఉంటే ఏదో విధంగా మీకు డబ్బులు వస్తాయి. మీకు ఏదైనా అవసరం వస్తే వాటిని అమ్మేసిన కూడా మీ అవసరాలు తీరుతాయి.
ప్లాటినం
బంగారంతో పాటు ప్లాటినం కూడా ఖరీదైనదే. దక్షిణాఫ్రికా, రష్యా, కెనడాలో ఇది ఎక్కువగా ఉంటుంది. ప్లాటినం ఒక గ్రాము దాదాపుగా రూ.2, 701 ఉంటుంది. దీన్ని కూడా ఎక్కువగా బంగారు ఆభరణాల్లో ఉపయోగిస్తారు.
కాలిఫోర్నియం
ఈ లోహం కూడా ఖరీదైనదే. దీన్ని 1950లో తయారు చేశారు. ఇది ఒక సింథటిక్ రేడియోధార్మిక మూలకం. అయితే దీన్ని సహజంగా తయారు చేయలేదు. మెటల్ డిటెక్టర్లలో, చమురు బావులలో చమురు, నీటి పొరల నుంచి దీన్ని తీశారు. దీని గ్రాము విలువ దాదాపుగా రూ.17 కోట్లు ఉంటుంది.
పల్లాడియం
దీన్ని ఎక్కువగా వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, నగల కోసం వాడుతుంటారు. ఈ పల్లాడియం ఎక్కువగా రష్యా, దక్షిణాఫ్రికా, కెనడాలో లభ్యమవుతుంది. దీని 10 గ్రాముల ధర రూ.26, 556 ఉంటుంది.
ఓస్మియం
ఈ ఓస్మియం అనేది ప్లాటినం ఖనిజాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీన్ని రష్యా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికాలో ఎక్కువగా లభ్యమవుతుంది. ఇది గ్రాము ధర రూ.1,50, 656 ఉంటుంది.
రోడియం
ఈ రోడియం ఎక్కువగా ప్లాటినం, నికెల్ మైనింగ్ వాటిలో బాగా లభ్యమవుతుంది. దీనిని ఎక్కువగా అద్దంలో ఉపయోగిస్తారు. దీని ధర గ్రాముకు రూ.15,477 ఉంటుంది.
రీనియం
ఇది ఎక్కువగా మాలిబ్డినైట్‌లో ఉంటుంది. ఇది కూడా ధర ఎక్కువగానే ఉంటుంది. దీని గ్రాము ధర దాదాపు రూ.8,000 ఉంటుంది.
రుథేనియం
ఈ లోహం ఎక్కువగా ఉత్తర, దక్షిణ అమెరికాలో లభ్యమవుతుంది. దీన్ని ఎక్కువగా చిప్ రెసిస్టర్లు, ఎలక్ట్రికల్ వంటి వాటిలో ఉపయోగిస్తారు.
ఇరిడియం
అ ఇరిడియం దక్షిణాఫ్రికా, రష్యాలోని నికెల్ మైనింగ్‌లో ఇది ఎక్కువగా లభ్యమవుతుంది. దీన్ని ఎక్కువగా ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగిస్తారు.