IPL 2025 : సాయంత్రం పూట తేరుతున్న సమయంలో అపరిమితమైన వినోదాన్ని అందించేందుకు ప్రతి ఏడాది ఐపీఎల్ సిద్ధంగానే ఉంటుంది. 2008లో మొదలైన ఐపిఎల్ ఇప్పటివరకు 17 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో 18వ ఎడిషన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రతి మ్యాచ్ కూడా ప్రేక్షకులకు అంతకుమించి అనే స్థాయిలోనే క్రికెట్ ఆనందాన్ని అందించింది. ప్రతి మ్యాచ్ కూడా సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూసే విధంగా సాగింది. అందువల్లే ఐపిఎల్ లో మ్యాచ్లకు విపరీతమైన వ్యూయర్షిప్ లభిస్తోంది. ఇక మ్యాచ్లు జరిగే ప్రాంతాలకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. ఏ ఒక్క మ్యాచ్ కూడా ప్రేక్షకులు లేకుండా వెళ వెళ పోవడం లేదు. దీంతో చూసే ప్రేక్షకులకు ఆనందం.. ఆడే ఆటగాళ్లకు ఉత్సాహం.. నిర్వహించే బిసిసిఐకి కాసుల మంత్రం..
Also Read : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొన్న ఆటగాళ్లు వీరే.. ఇంకా కొనే అవకాశం..
అంతకుమించి..
గత సీజన్లో ఐపిఎల్ సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించింది. గత ఐపీఎల్ లో జియో సినిమా (jio cinema) ఓటీటీ లో స్ట్రీమ్ చేసింది. గత సీజన్లో జరిగిన 51 మ్యాచ్ లకు 510 మిలియన్ వ్యూయర్ షిప్ లభించింది. ఇదే విషయాన్ని జియో హాట్ స్టార్ (jio hotstar) వెల్లడించింది. అంతేకాదు ఈ సీజన్లో గత ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్(SRH vs RR) రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ కు 28.6 (286 మిలియన్) వ్యూస్ లభించాయి. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు పూర్తయ్యాయి. కాగా స్టార్ స్పోర్ట్స్ లో 25.3, జియో హాట్ స్టార్ లో 135 కోట్ల వ్యూస్ వచ్చాయని తెలుస్తోంది. ఇప్పటివరకు ఐదువేల కోట్ల నిమిషాల వాచ్ టైం నమోదు అయిందని సమాచారం. ” క్రికెట్ పోటీలు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నాయి. చివరి వరకు విజయం కోసం జట్లు పోటీ పడుతున్నాయి. తమ శక్తి సామర్థ్యాలకు మించి ఆడుతున్నాయి. అందువల్లే వ్యూయర్షిప్ లో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. ఇంకా క్రికెట్ మ్యాచ్లు చాలా జరగాల్సిన నేపథ్యంలో.. ఇంకా ఎక్కువ వ్యూయర్షిప్ నమోదవుతుందని” జియో హాట్ స్టార్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఐపీఎల్ సందర్భంగా ప్రసారమయ్యే మ్యాచ్లను ఉచితంగా చూసే అవకాశాన్ని జియో హాట్ స్టార్ కల్పించడం వల్ల సబ్ స్క్రైబర్లు పెరుగుతున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను ఉచితంగా చూసే అవకాశం కల్పించడంతో వ్యూస్ పెరుగుతున్నాయి. దీంతో జియో హాట్ స్టార్ ప్రకటనల విషయంలో పండగ చేసుకుంటుంది. విపరీతంగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. సెకండ్ల వ్యవధి ఉన్న ప్రకటనకు లక్షల్లో చార్జ్ చేస్తోందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఐపీఎల్ ద్వారా జియో హాట్ స్టార్ భారీగా వెనకేసుకుంటుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
Also Read : చెన్నై బౌలర్ బాల్ ట్యాంపరింగ్..MI పై అందుకే గెలిచిందా?