Homeలైఫ్ స్టైల్IPL 2026 Schedule Release: ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ : ఫస్ట్ మ్యాచ్ లోనే ఎస్ఆర్.హెచ్.....

IPL 2026 Schedule Release: ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ : ఫస్ట్ మ్యాచ్ లోనే ఎస్ఆర్.హెచ్.. ఎవరితో ఢీ అంటే?

IPL 2026 Schedule Release: కోట్లాదిమంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపిఎల్ 2026 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. బీసీసీఐ సామాజిక మాధ్యమాల వేదికగా ఈ షెడ్యూల్ విడుదల చేసింది. బీసీసీఐ ప్రకటించిన వివరాల ప్రకారం ఈనెల 28 నుంచి ఐపీఎల్ మొదలవుతుంది. గత సీజన్లో బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టు పై కన్నడ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. తద్వారా తొలిసారి ఐపిఎల్ ట్రోఫీ అందుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ […]

IPL 2026 Schedule Release: కోట్లాదిమంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపిఎల్ 2026 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. బీసీసీఐ సామాజిక మాధ్యమాల వేదికగా ఈ షెడ్యూల్ విడుదల చేసింది. బీసీసీఐ ప్రకటించిన వివరాల ప్రకారం ఈనెల 28 నుంచి ఐపీఎల్ మొదలవుతుంది.

గత సీజన్లో బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టు పై కన్నడ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. తద్వారా తొలిసారి ఐపిఎల్ ట్రోఫీ అందుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఈ ఏడాది జరిగే టోర్నీలో తొలి మ్యాచ్ బెంగళూరు ఆడుతుంది. బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య మార్చి 28న బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.

రెండో మ్యాచ్ మార్చి 29న ముంబై, కోల్ కతా మధ్య జరుగుతుంది. మార్చి 30న రాజస్థాన్ చెన్నై, మార్చి 31న పంజాబ్, గుజరాత్, ఏప్రిల్ ఒకటిన లక్నో, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతాయి. ఏప్రిల్ 2న కోల్కతా, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 3న చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 4న ఢిల్లీ, ముంబై పోటీ పడతాయి. ఏప్రిల్ 4న గుజరాత్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఏప్రిల్ 5న బెంగళూరు, చెన్నై మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 6న కోల్ కతా, పంజాబ్ పోటీ పడతాయి. ఏప్రిల్ 7న రాజస్థాన్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 8న ఢిల్లీ, గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 9న కోల్కతా, లక్నో పోటీ పడతాయి. ఏప్రిల్ 10న రాజస్థాన్, బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 11న పంజాబ్, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 11న చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 12న లక్నో, గుజరాత్ పోటీ పడతాయి. ఏప్రిల్ 12న ముంబై, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.

బుధవారం ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ ప్రకటించింది తొలిదశ షెడ్యూల్ మాత్రమే. రెండవ దశ షెడ్యూల్ ను త్వరలోనే బిసిసిఐ విడుదల చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ మొదటి మ్యాచ్ బెంగళూరు తో, రెండవ మ్యాచ్ కోల్ కతా తో, మూడో మ్యాచ్ లక్నోతో, నాలుగో మ్యాచ్ పంజాబ్ తో ఆడుతుంది.. ఈసారి హైదరాబాదులో కొత్త ప్లేయర్లు ఉన్నారు. వారి మీద మేనేజ్మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సరే ట్రోఫీ సాధించాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకుంది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఐపీఎల్ నిర్వహిస్తారా? లేదా? అన్న ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అయితే ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మాత్రం నిర్వహణకే మొగ్గు చూపింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper