https://oktelugu.com/

Chanakya Niti: మీ వ్యక్తిత్వం మహోన్నతంగా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించాలి… ఆచార్య చాణిక్యుడు!

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మంచి వ్యూహకర్త. నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో, ఎదుటి వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో వివరిస్తూ ఎన్నో పుస్తకాలను రచించారు. ఆయన రచించిన పుస్తకాలు నేటికీ అనుచరనలో ఉన్నాయి. ఇప్పట్లో మనుషుల ఆలోచనా తీరు అప్పట్లోనే చాణక్యనీతి గ్రహించి తన పుస్తకాలలో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆయన రాసిన గ్రంథాలలో ఎన్నో మంచి మంచి అంశాలను పొందుపరిచారు. ఎదుటి వ్యక్తిని అందంతో కాకుండా వారి గుణ లక్షణాలతో అంచనా వేయాలని ఆచార్య […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 5, 2022 5:10 pm
    Follow us on

    Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మంచి వ్యూహకర్త. నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో, ఎదుటి వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో వివరిస్తూ ఎన్నో పుస్తకాలను రచించారు. ఆయన రచించిన పుస్తకాలు నేటికీ అనుచరనలో ఉన్నాయి. ఇప్పట్లో మనుషుల ఆలోచనా తీరు అప్పట్లోనే చాణక్యనీతి గ్రహించి తన పుస్తకాలలో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆయన రాసిన గ్రంథాలలో ఎన్నో మంచి మంచి అంశాలను పొందుపరిచారు. ఎదుటి వ్యక్తిని అందంతో కాకుండా వారి గుణ లక్షణాలతో అంచనా వేయాలని ఆచార్య చాణక్య సూచించారు. అలాగే మనకు జన్మించిన పుత్రుడే ఆస్తికి వారసుడు అనుకోవడం తప్పు అని ఆయన తెలిపారు.

    మంచి విద్యావంతులు ఆస్తిని నిలబెట్టుకోవడానికి, అదేవిధంగా దానిని సద్వినియోగం చేసుకోవడానికి అర్హులు అని, దానిని గుర్తించుకొని మీ ఆస్తులను అర్హులకు మాత్రమే ఇవ్వాలి అనే ఆయన సూచించారు. మనసును సంస్కరించుకోవడానికి మించిన గొప్ప తపస్సు మరొకటి లేదు అని తెలిపారు. అదేవిధంగా అన్ని వాటిలో సంతృప్తిని పొందడం ప్రారంభిస్తే, అంతకు మించిన ఆనందం మరొకటి లేదు చాణక్య నీతి చెబుతోంది. అలాగే మనలో ఉన్న అత్యాశను తొలగించు కున్నట్లు అయితే, అలాంటి వారు పెద్ద వ్యాధిని నియంత్రించుకున్న వారు అవుతారు అని ఆచార్య బోధించారు.

    అలాగే దయకు మించిన మంచి గుణం లేదు అని ఆయన హితవు పలికారు. మనం తినే ఆహారం ఎటువంటిది అయితే మన మనసు కూడా అలాగే తయారవుతుంది అని తెలిపారు. సాత్విక, రాజసిక, తామసిక ఆహారం మనిషి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. అలాగే విద్యను అభ్యసించిన వారికి మాత్రమే ప్రతి చోట గౌరవం దక్కుతుంది అని చాణక్యనీతి తెలిపారు. చదువుకున్న వ్యక్తికి ఏది ఒప్పు ఏది తప్పు అని తేడా తెలుస్తుంది. చదువుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా తన జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ ప్రతి ఒక్క చోట గౌరవం పట్టించుకుంటారని ఆయన తన నీతి గ్రంథం ద్వారా తెలిపారు.