https://oktelugu.com/

KCR-Jagan: కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న జగన్ టీం

KCR-Jagan: తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం కావ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమ‌ర్శ‌ల‌కు దిగాయి. దీంతో టీఆర్ఎస్ డైల‌మాలో ప‌డుతోంది. ఈ మ‌ద్య తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌ధ్య విభేదాలు పెరిగాయి. ష‌ర్మిల తెలంగాణ‌లో అడుగు పెట్ట‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య అగాధం పెరిగిపోయింది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేగుతున్నాయి. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ పై […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 5, 2022 3:12 pm
    Follow us on

    KCR-Jagan: తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం కావ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమ‌ర్శ‌ల‌కు దిగాయి. దీంతో టీఆర్ఎస్ డైల‌మాలో ప‌డుతోంది. ఈ మ‌ద్య తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌ధ్య విభేదాలు పెరిగాయి. ష‌ర్మిల తెలంగాణ‌లో అడుగు పెట్ట‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య అగాధం పెరిగిపోయింది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేగుతున్నాయి. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. రాజ్యాంగంపై కేసీఆర్ కు చుల‌క‌న భావం ఉంద‌ని ఎద్దేవా చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ పై అన్ని పార్టీలు విమ‌ర్శ‌ల దాడి కొన‌సాగిస్తున్నాయి.

    KCR-Jagan

    KCR-Jagan

    దీనిపై ఏపీలో సీఎం జ‌గ‌న్ స్పందించ‌కున్నా విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేశారు. రాజ్యాంగంపై కొన్ని కుహ‌నా లౌకిక శ‌క్తులు అవాకులు చెవాకులు పేలుతున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. రాజ్యాంగంపై అవ‌గాహ‌న లేని వ్య‌క్తులు దాని గురించి మాట్ల‌డ‌టం విడ్డూరంగా ఉంద‌ని కేసీఆర్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. రాజ్యాంగం గురించి తెలియ‌క‌పోవ‌డం వారి తెలివిత‌క్కువ త‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు.

    Also Read: Modi vs KCR : ప్రధాని మోడీతో కేసీఆర్ కు సంధి లేదు.. సమరమే.. రుజువు ఇదిగో!

    ప‌దవిలోకి వ‌చ్చిన కొత్త‌లో తెలంగాణ‌, ఏపీ సీఎంలు స్నేహితులుగా మెలిగినా త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరుగుతూ వ‌స్తోంది. ఇటీవ‌ల కాలంలో ఇద్ద‌రు మాట్లాడుకున్న సంద‌ర్భాలు కూడా త‌క్కువే. దీంతో రెండు రాష్ర్టాల మ‌ధ్య పెరిగిన దూరంతో వారిని అనుబంధం కూడా త‌గ్గిపోతోంది. ఇన్నాళ్లు ఏ కార్య‌క్ర‌మం చేసినా ఆహ్వానించుకునే నాయ‌కులు ఈ మ‌ధ్య వారి సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. ఈ క్ర‌మంలో వారు ఎడమొహం పెడ‌మొహం పెడుతున్న‌ట్లు తెలుస్తోంది.

    దీంతో కేసీఆర్ ను జ‌గ‌న్ టార్గెట్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. రాజ్యాంగంపై ఆయ‌న మాట్లాడిన మాట‌ల‌పై జ‌గ‌న్ ఏం స్పందించ‌కున్నా అక్క‌డి మంత్రి మాత్రం కేసీఆర్ ను ల‌క్ష్యంగా చేసుకుని మాట్లాడ‌టంతో ఈ విష‌యం అర్థ‌మైపోతోంది. రాజ్యాంగంప‌ట్ల అవ‌గాహ‌న లేకుండా రాజ్యాంగాన్ని మార్చాల‌ని చెప్ప‌డంతో కేసీఆర్ ఇరుకున ప‌డ్డారు. ప్ర‌స్తుతం దేశంలోనే అన్ని ప్రాంతాల నుంచి కేసీఆర్ మాట‌ల‌పై విమ‌ర్శ‌లే వ‌స్తున్నాయి. కానీ టీఆర్ఎస్ నేత‌లు మాత్రం దాన్ని వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ కు వ‌స్తున్న అప్ర‌దిష్ట పై ప‌ట్టించుకోవ‌డం లేదు.

    Also Read: Jagan vs AP Employees: ఉద్యోగుల్లో చీలిక తెచ్చే దిశగా.. జగన్ సర్కారు ఎత్తుగడలివే..!

    Tags