Homeలైఫ్ స్టైల్Guntagalagara Aaku : ఈ ఆకు వాడితే జుట్టు పెరగుతుందట

Guntagalagara Aaku : ఈ ఆకు వాడితే జుట్టు పెరగుతుందట

Guntagalagara Aaku : మనకు ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను ఉపయోగించి మందులు తయారు చేస్తారు. జుట్టు ఊడిపోకుండా, తెల్లబడకుండా చేయడంలో ఎన్నో ఆకులు అక్కరకు వస్తాయి. ఇందులో గుంటగలగర ఆకు ముఖ్యమైనది. జుట్టు కోసం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని రసం బట్టలో వడగట్టి ముక్కులో చుక్కలుగా వేసుకుని పీలుస్తూ ఉంటే దీర్ఘకాలిక నొప్పులు తలనొప్పి, తల బరువు, మెదడు బలహీనత, చిన్న వయసులో వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. దీని ఆకులు వాడుకుని ఈ మందు తయారు చేసుకోవచ్చు. దీని ఆకులు మాత్రమే వాడుకుని నూనె తయారు చేసుకుంటే వెంట్రుకలు పొడవుగా, దృఢంగా అవుతాయి. నువ్వుల నూనెతో ఈ ఆకుల మిశ్రమాన్ని కలుపుకుని వాడుకుంటే ఎంతో మంచిది.

గుంటగలగర ఆకులకు తగినంత నీరు కలిపి నూరి బట్టలో పిండి ఆ రసాన్ని నోటిలో పోసుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు పుక్కిలిస్తే నోటిపూత, నాలుక పూత, నాలుకపై పగుళ్లు, నోటిలో పుండ్లు మొదలైన సమస్యలు దూరమవుతాయి. ఐదు నుండి పది గ్రాముల ఆకుల్ని తీసుకుని కొద్దిగా ఉప్పు చేర్చి మెత్తగా నూరి అరకప్పు నీటిలో కలపాలి. దీన్ని వడబోసి వచ్చిన రసాన్ని ఉదయం సాయంత్రం రెండు పూటల భోజనానికి ముందు తాగితే కడుపు నొప్పి మాయమవుతుంది. కడుపు ఉబ్బరం, పేగులలో అలజడి తగ్గుతాయి. మలబద్ధకం సమస్య ఉండదు.

చర్మవ్యాధులకు ఇది మంచి మందులా పనిచేస్తుంది. దీని ఆకులను నీటితో మెత్తగానూరి ఆ ముద్దను గజ్జి, తామర, దద్దుర్లు, దురదలు, పుండ్లు, కురుపులు, గాయాలకు పరిష్కారం చూపుతుంది. గుంటగలగర వేళ్లు, వేళ్ల పొడి, ఇంట్లో కొట్టుకున్న పసుపు కొమ్ముల పొడి సమ పాళ్లల్లో కలిపి నిలువ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు పూటలా అరచెంచా చొప్పున వాడితే చర్మ వ్యాధులు నయం అవుతాయి. మట్టి మూకుడులో వాము వేసి అది మునిగే వరకు గుంటగలగర ఆకుల రసం పోసి రాత్రంతా నానటెట్టాలి. మరుసటి రోజు ఎండలో పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే సాయంత్రానికి రసమంతా గింజలలోకి ఇంకుతుంది.

దీన్ని బాగా ఎండబెట్టాలి తరువాత ఆ గింజలను పొడిచేసి జల్లెడపట్టి నిలువ చేసుకోవాలి. కప్పు మంచినీటిలో పావు చెంచా పొడి వేసి బాగా కలిపి రెండు పూటలా భోజనానికి గంట ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల పైత్యం, ఉద్రేకం తగ్గుతాయి. కాలేయ సమస్యలు దూరమవుతాయి. అరికాళ్లు, అరిచేతుల మంటలు, దురదలు, నొప్పులు, పగుళ్లు, చర్మం ఎండిపోవడం, నల్లగా మాడిపోవడం, పెదాలు పగలడం వంటి సమస్యలు దూరం చేస్తుంది. ఇలా గుంటగలగర ఆకులతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చెబుతుంటారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper