
Actress Poorna: బుల్లితెరను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి పూర్ణ గురించి తెలుసు. సినిమాల ద్వారా కెరీర్ స్ట్రాట్ చేసిన ఆమె అవకాశాలు రాకపోవడంతో టీవీ షోల్లో అడుగుపెట్టారు. ‘ఢీ’ అనే షో ద్వారా పూర్ణ ఫేమస్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూర్ణ ఓ డైరెక్టర్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఓ సినిమా షూటింగ్ తీసేటప్పుడు తనను ఆయన టార్చర్ పెట్టాడని, నొప్పి.. నొప్పి.. అన్నా వదల్లేదని అన్నారు. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడిచిన తరువాత ఆ డైరెక్టర్ పై ఇప్పుడు పూర్ణ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
శ్రీహరి హీరోగా వచ్చిన ‘శ్రీ మహాలక్ష్మి’ అనే సినిమా ద్వారా మలయాళ బ్యూటీ పూర్ణ తెలుగు వెండితెరపై కనిపించారు. ఆ సమయంలో ఈ ముద్దుగుమ్మను ఎవరూ పట్టించుకోలేదు. కానీ డైరెక్టర్ రవిబాబు తీసిన ‘అవును’ అనే సినిమాలో నటించిన తరువాత పూర్ణకు గుర్తింపు వచ్చింది. అవును1, అవును2 సీనిమాల్లోనూ పూర్ణ నటించారు. అయితే రెండో పార్ట్ సినిమా షూటింగ్ సమయంలో పూర్ణను డైరెక్టర్ రవిబాబు తీవ్రంగా టార్చర్ పెట్టాడట.

ఈ సినిమాలో ఏనుగు పూర్ణను ఎత్తుకొని కిందికి పడేసే సీన్ ఉంటుంది. అలా చూపించడానికి పూర్ణను తాళ్లతో కట్టి పైకి కిందికి వేలాడదీయాలి. ఈ సమయంలో పూర్ణను ఒకసారి తాళ్లతో కట్టి పైకి తీసుకెళ్లారు. కానీ ఈ సమయంలో కెమెరా ఆన్లో లేదట. తప్పును గుర్తించిన రవిబాబు ఈ సీన్ ను మరోసారి తీయాలన్నారట. దీంతో మరోసారి పూర్ణ కాళ్లు, చేతులకు తాళ్లు కట్టి పైకి తీసుకెళ్లేటప్పుడు నొప్పి.. నొప్పి.. అంటూ అరిచిందట. అయినా డైరెక్టర్ వినకుండా తాను అనుకున్న సీన్ పూర్తి చేశాడట.
సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత కొందరు ఈ విషయాన్ని బయటపెట్టారు. కానీ పూర్ణ ఆ సమయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. డైరెక్టర్ రవిబాబు మాత్రం కొన్ని సీన్లు చేసేటప్పుుడు పూర్ణను టార్చర్ పెట్టాల్సి వచ్చిందని అన్నారు. అయితే ఇన్ని రోజుల తరువాత పూర్ణ ఈ విషయాన్ని ఆమె బయటపెట్టడంతో ఆసక్తికంగా మారింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.