Jobs: ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ టెక్నాలజీ నిరుద్యోగులకు, అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఈ సంస్థ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. మొత్తం 23 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 3 ఉండగా బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు లక్ష రూపాయల వరకు వేతనం లభించనుంది. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 9 ఉండగా బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు లక్ష రూపాయల వేతనం లభించే ఛాన్స్ ఉంది.
ఫుల్ స్టాక్ డెవలపర్ పోస్టులు 7 ఉండగా అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు సైతం లక్ష రూపాయల వేతనం లభిస్తుంది. టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ పోస్టులు 1 ఉండగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.45,000 వేతనంగా లభిస్తుంది. ప్రాజెక్ట్ టెక్నిక్ అసిస్టెంట్ పోస్టులు 2 ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ.30,000 వేతనంగా లభిస్తుంది.
ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు 1 ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ.27,000 వేతనంగా లభిస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.