Revanth Reddy House Arrest: దేశంలో ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. పెట్రో, గ్యాస్ ధరలు రోజురోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమించేందుకు సిద్ధమైంది. పెట్రో, గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టేందుకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా విద్యుత్ సౌధ, సివిల్ సప్లయ్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. ఆందోళన విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరింది.
దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఎక్కడ దొరికితే అక్కడే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో ధర్నా కార్యక్రమం నిర్వహించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విద్యుత్ సౌధ ముట్టడికి బయలుదేరనున్నట్లు తెలియడంతో పోలీసులు ఆయనను కూడా అరెస్టు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: CM KCR Paddy Issue: ఉసిగొల్పడమేనా? ఉద్యమించేది ఏమైనా ఉందా కేసీఆర్ సార్..?
ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన కాంగ్రెస్ నేతలు భేటీ అయి విభేదాలు పక్కన పెట్టి కలిసి నడుస్తామని చెప్పినందున ఈ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భావిస్తోంది. దీని కోసమే అధిష్టానం దిశా నిర్దేశం చేసింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. ఏ క్షణాన్నైనా రేవంత్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు టీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టాలని కాంగ్రెస్ ముందుకొస్తోంది. ఇటీవల పెంచిన విద్యుత్ చార్జీలతో ప్రజలపై పెనుభారం పడుతుందని చెబుతోంది. ప్రజల పక్షాన నిలబడి పోరాడేందుకు రెడీ అవుతోంది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించి విద్యుత్ సౌధ ముట్టడించాలని నిర్ణయించింది. ఉదయం 10.30 నిమిషాలకే విద్యుత్ సౌధ ముట్టడించాలని భావించడంతో కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డితో పాటు కార్యనిర్వహణ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మల్లు రవి, శ్రవణ్ వంటి నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ట్విటర్ వేదికగా రేవంత్ రెడ్డి పోస్టులు పెట్టారు. కేసీఆర్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:BJP Focus On Uttarandhra: ఉత్తరాంధ్రపై బీజేపీ ఫోకస్.. సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టిన కాషాయ దళం