Roosters crow: ఉదయం లేవాలంటే అలారం పెట్టుకోవాలి. ఏ అవసరం ఉన్నా సరే మేల్కోవాలి. దీనికి అలారం ఉండాలి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం అలారాలు ఉండేవి. మరి అంతకంటే ముందు ఏం ఉండేవి? మరి అప్పటి ప్రజలు ఎలా సమయానికి మేల్కొనేవారు? ఇదంతా ఆలోచిస్తే వామ్మో అప్పటి మనుషులు ఇలా ఫోన్ లేకుండా ఎలా జీవించారు అని ఇప్పటి వారికి అనిపిస్తుంది. కానీ ఆ కాలం ఎంత మధురమైన జ్ఞాపకాలను అందించింది కదా. ఇప్పటి వారికి చాలా మందికి జస్ట్ ఫోన్, సోషల్ మీడియా. కానీ అప్పుడు అంతా ప్రాక్టికల్. ఒక దగ్గర కూర్చోవడం లేదు. ఆడుకోవడం, పాడు కోవడం.
Also Read: వర్షాకాలంలో ఇంటిపై మొక్కలు పెంచే వారికి సూపర్ టిప్స్…
బాల్యం గురించి టాపిక్ వస్తే చాలండీ. ఏదో చెప్పాలి అనుకునే నేను. ఏదో చెప్పేస్తుంటాను. ఈ రోజు మీతో అప్పటి ప్రజలు ఎలా తెల్లవారు జామునే లేచేవారు అనే టాపిక్ మాట్లాడాలి అనుకుంటున్న. అయితే అప్పుడు కోళ్లు నిద్ర లేపేవి. ఇప్పటి అలారం ఆపేసి పడుకోవచ్చు. కానీ అప్పటి కోడి కూస్తూనే ఉండేది. కొందరికి ఉదయం లేవడం బద్దకం అనిపిస్తే నీ కోన్ని కొయ్య ఏం ఒర్రుతుంది అని దుప్పటి నిండా కప్పుకొని పడుకునే వారు. కానీ కొందరు అమ్మో ఇంత పొద్దెక్కిందా అంటూ నిద్ర లేచి ఫాస్ట్ గా పని చేసుకునే వారు.
మరి ఈ కోడి ఎలా కరెక్ట్ సమయానికి నిద్ర లేస్తుంది? అందరిని నిద్ర లేపింది అనే విషయం మీద మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ఇప్పటికీ కూడా ఊరిలో కోల్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి మిగిలిన అందరినీ నిద్ర లేపుతుంటాయి. మరి దీని వెనుక రహస్యం ఏంటంటే? ప్రతి రోజు అవి అంత నిక్కచ్చిగా సరైన సమయానికి కూయడానికి కారణం ఉంది. వాటికి ముందే టైం తెలుస్తుందట. నిజమే మీరు చదివింది. మనకంటే 45 నిమిషాల ముందే వెలుతురును చూస్తాయి అంటున్నారు శాస్త్రవేత్తలు.
Also Read: చిన్నప్పుడు తిన్న ఉల్టాపల్టా గుర్తుందా?
వెలుతురు వస్తుందన్న సంకేతాన్ని ముందే తెలుసుకొని కొక్కరోక్కో అని కూస్తాయి. ఇతర జంతువులకు కూడా సంకేతాలను పంపుతాయి. మరో నిజం ఏంటంటే? ఇది కాస్త మీకు జీర్ణం కాదనుకుంట. కానీ వాస్తవం. మనల్ని మేల్కొలిపే ఆ గొంతుల్నే మనం ఎక్కువగా కోస్తున్నాము. అదేనండీ ఫుల్ గా చికెన్ మీద పిచ్చితో తినేస్తున్నాం కదా. అదన్నమాట. మనల్ని లేపాల్సినవి అవే. మన రుచిని ఆస్వాదించడానికి ఉపయోగపడేవి అవే అన్నమాట.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.