90’s Games Kids Food: చిన్నప్పుడు కొన్ని సరదాలు భలే అనిపిస్తాయి. అవి గుర్తుకు వస్తే ఒక్కసారి బాల్యానికి తిరిగి వెళ్తే బాగుండు అనిపిస్తుంది కదా. బాధ్యతలు తెలియదు. బరువులు లేవు, బంధాలపై అవగాహన లేదు. ఆడుకోవడం, అమ్మ కొంగుచాటున దాక్కోవడం, నాన్న అంటే భయం, ఏమైనా కావాలి అనిపిస్తే అక్కతో, చెల్లితో అడిగించడం, ఇలా ఎన్ని ముచ్చట్లు ఉన్నాయి కదా. చెప్పుకుంటూ పోతే మన పదాల లిమిట్ కూడా సరిపోదు. కానీ ఆ బాల్యం తిరిగి వస్తుందా? అసలు రాదు. పోని అలాంటి రోజును ఒకరోజు అయినా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా సరే అసలు కుదరదు.
మీరు చిన్నప్పుడు ఎన్నో తినే ఉంటారు కదా. అమ్మ చేసినా అప్పాలు జేబులో వేసుకొని స్కూల్ లో టీచర్ పాఠాలు చెబుతుంటే చప్పుడు చేస్తూ మరీ తిన్నారు కదా. స్కూల్ ముందు వచ్చే పిప్పర్ మెంట్లు, మక్కపాలాలు, రేనిగాయలు కొని తింటూ క్లాస్ లు విన్నారు కదా. ఆశా చాక్లెట్ల మజా ఇప్పటికీ గుర్తుంది కదా మీకు. ఇదంతా పక్కన పెడితే ఒక ఉల్టాపల్టా అనే భలే మ్యాజిక్ చేసేది. అది గుర్తు వచ్చిందా. మీకు ఫోటోలో కనిపిస్తుంది చూడండి అదే. దాన్ని తినడానికి కంటే ఆడుకోవడానికే ఎక్కువగా కొనేవాళ్లం కదా.
మనం 90`s కిడ్స్. లక్కీ కిడ్స్ అని ఎంత మంది అనుకున్నారో. నిజంగానే లక్కీ. చిన్నతనంలో ఎప్పుడో ఒకసారి ఈ గురు పేరుతో వచ్చే ఈ ఉల్టాపల్టాను కొని తినే ుంటారు. పెద్దమ్మా, పెద్దనాన్న, తాతాయి, ఉల్టాపల్టా పేర్లతో ఇది షాప్ లలో ఉండేది. అయితే దీని మీద రుమాలు చుట్టుకున్న పురుషుడు కనిపిస్తే టర్న్ చేయగానే జెండర్ మారి మహిళ కనిపిస్తుంది. ఇది ఎలా జరుగుతుందో అసలు అర్థం కూడా అయ్యేది కాదు. ఈ మాయాజాలం చూసి ఎంత మురిసిపోయి ఎన్ని సార్లు ఆలోచించాము కదా. దీన్ని నిజంగానే తినడం కోసం కంటే ఆడుకోవడం కోసమే ఎక్కువగా కొనేవాళ్లం. చిన్నప్పుడు సరదా కోసం కొనేవాళ్లం కానీ దీని లోపల ఉండేది మౌత్ ఫ్రెషనర్ అని మీకు ఇప్పుడైనా తెలుసా? చాలా మందికి ఇప్పటికీ కూడా ఈ విషయం తెలియదు. కానీ కొనుగోలు చేశాము. తిన్నాము.
కోతి కొమ్మచ్చి, కోకూ, కబడ్డీ వంటి ఎన్నో ఆటలు ఆడుకున్నాము గుర్తుందా? ఎన్నో ఆటలు, పాటలు, మాటలు, ముచ్చట్లు ఇలా కాలం చాలా సాఫీగా సాగిపోయింది కదా. కానీ ఇప్పుడు జీవితం చూశారా ఎలా ఉందో? చాలా మార్పు వచ్చింది కదా. ఎవరితో అయినా కాసేపు సరదాగా మాట్లాడాలంటే కూడా సమయం లేదు. అప్పుడు నువ్వే, ఇప్పుడు నువ్వే కానీ కాలంతో పాటు మన పనులు, పరిచయాలు మారిపోయాయి. సరే మరి మీ చిన్నప్పటి చాలా విషయాలు మీకు గుర్తు వచ్చే ఉంటాయి. మరి మీకు ఎలాంటి మెమొరీలు గుర్తు ఉన్నాయో ఒకసారి కామెంట్ రూపంలో పంచుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.