spot_img
HomeజాతీయంIran Israel War Impact On LPG supply India: అతిథి దేవో భవ... కానీ...

Iran Israel War Impact On LPG supply India: అతిథి దేవో భవ… కానీ ఇప్పుడు ’రావద్దో భవ!’

Iran Israel War Impact On LPG supply India: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ పశ్చిమాసియాలో మొదుల పెట్టిన యుద్ధం ఇప్పుడు 30 దేశాలకు విస్తరించింది. అమెరికా అనుకూల గల్ఫ్‌ దేశాలను ఇరాన్‌ టార్గెట్‌ చేసింది. హార్మూజ్‌ జల సంధి మూసివేసింది. దీంతో ఆయిల్‌ ఉత్పత్తి, రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో ఆయిల్‌ ధరలు పెరిగాయి. భారత్‌లో గ్యాస్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ప్రధాన పట్టణాలు, నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. టిఫిన్‌ తయారీ నిలిచిపోయింది. మాస్టళ్ల నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు అతిథి సంస్కృతి, పండుగలపై ప్రభావం పడింది.

మన సంస్కృతిలో అతిథి దేవుడు, కానీ 2026 మార్చిలో ఎల్‌పీజీ కొరతతో ఇది ‘రావద్దో భవ’గా మారింది. గతంలో వీకెండ్లు బంధువుల కలయికలతో కళకళలాడేవి, ఇప్పుడు వంటింటి గ్యాస్‌ సిలిండర్‌ పొదుపు మాత్రమే ప్రధానం. ఐవోసీఎల్‌ డేటా ప్రకారం, ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా 20% సిలిండర్లు ఆలస్యమవుతున్నాయి. ఫలితంగా, దగ్గరి బంధువులు ‘ఇప్పుడు రావద్దు‘ అని వాట్సాప్‌ మెసేజీలు పంపుతున్నారు.

వంటగది యుద్ధభూమి..
గ్యాస్‌ ఏజెన్సీల వద్ద భారీ లైన్లు, డెలివరీలు 7–10 రోజులు ఆలస్యం. ప్రభుత్వం ‘నిల్వలు పుష్కలం‘ అన్నా, గ్రౌండ్‌ లెవల్‌లో సాధారణ కుటుంబాలు ఒక సిలిండర్‌ను 45 రోజులు చాటుకుంటున్నాయి. వెచ్చని నిట్టూర్పులు విడుస్తూ, ‘ఉన్నది పోయ్యి మీద కూడా పొదుపు‘ అంటున్నారు. ఇది ఆర్థిక భారాన్ని మాత్రమే కాక, మానసిక ఒత్తిడిని కూడా పెంచుతోంది. బంధువుల రాకకు ముందస్తు ’నో’లు చెప్పాల్సి వస్తోంది.

హోటళ్లు కూడా బంద్‌..
ఇంట్లో వండకపోతే హోటళ్లకు వెళ్లాలనుకుంటే అక్కడ కూడా గ్యాస్‌ టాక్స్‌ 10–15% పెరిగింది. చాలా రెస్టారెంట్లు మెనూ తగ్గించి, పక్కా సేవలు ఆపేశాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిపోర్టు ప్రకారం, 30% చిన్న హోటళ్లు భాగస్వామ్యంగా నడుపుతున్నాయి. ఫలితంగా, రెండు పూటల భోజనం కూడా ఇబ్బందిగా మారింది – బంధువులతో ’అవుట్‌సైడ్‌’ ప్లాన్‌లు కూడా క్యాన్సిల్‌ అవుతున్నాయి.

పండుగలపై ప్రభావం..
ఉగాది (మార్చి 19న) ఉంది, రంజాన్‌ 22 లేదా 23న ఉంది. ఈ నేపథ్యంలో గ్యాస్‌ కొరత ఇప్పుడు పండుగలపై పడింది. హిందూ పండుగల్లో పులిహోర, పప్పన్నం వంటలు తప్పనిసరి. వీటి తయారీకి గ్యాస్‌ రెట్టింపు అవసరం. ఇక రంజాన్‌ సందర్భగా ముస్లిం కుటుంబాల్లో ఇఫ్తార్‌ వంటలు తగ్గిపోయాయి. పండుగల సీజన్‌లో 40% డిమాండ్‌ పెరుగుతుందని అంచనా.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version