Roof top plants care: ఒకప్పుడు ఇంటి పరిసర ప్రాంతాల్లో స్థలం ఉండడంతో అందులో కూరగాయలు, పూల చెట్లను పెంచుకునేవారు. కానీ ఇప్పుడు నగరాల్లో స్థలం లేకపోవడంతో మిద్దె తోట, కిటికీ గార్డెన్ వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవి అవసరమైన కూరగాయలను అందిస్తూ.. స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తుంటాయి. అయితే వర్షాకాలంలో ఈ గార్డెన్ తో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవగాహన లేకుండా కొన్ని పెంచుకోవడం వల్ల అవి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. వర్షాకాలంలో అవసరమైన కూరగాయలు లేదా పూలు వంటివి పెంచుకోవడం ద్వారా ఎలాంటి నష్టం ఉండదు. ఇలా గార్డెన్ ఏర్పాటు చేసుకున్న వారు వర్షాకాలంలో సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాలి.
Also Read: చిన్నప్పుడు తిన్న ఉల్టాపల్టా గుర్తుందా?
మిద్దె తోట ఉన్నవారు వర్షాకాలంలో సాధారణ టమాటా వంటివి కాకుండా ఆకుకూరలు వంటివి పెంచుకోవాలి. ఇవి తేమ ఉన్న వాతావరణాన్ని బాగా తట్టుకుంటాయి. ఆకుకూరల్లో పాలకూర, ఉసిరికాయ వంటివి ఈ వాతావరణం లో ఎక్కువగా పెరుగుతాయి. అందువల్ల మిగతా వాటిని జోలికి పోకుండా వీటిని మాత్రమే పెంచుకోవడం మంచిది.
ఇంటి పైన, బాల్కనీలో గార్డెన్ ఉన్నవారు వర్షపునీరు ఎక్కువగా నిలవకుండా చూసుకోవాలి. ఎందుకంటే పూలు లేదా కూరగాయలు పెంచుకునే కుండీల్లో ఎప్పుడూ నీరు ఉండడం వల్ల ఇందులో బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ నీరు అలాగే ఉండడం వల్ల వేర్లకు తెగులు లేదా శిలీంద్రావ్యాధులకు కారణం అవుతుంది. అందువల్ల ఈ నీటిని ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. అయితే ముందు జాగ్రత్తగా కలపా లేదా ఇటికల తో నీరు వెళ్లే విధంగా నిర్మించుకోవాలి.
కూరగాయలు పెంచే తొట్టిలో నీరు నిలవకుండా ఉండాలంటే ఇందులో ఎండుకడ్డి, ఎండిన ఆకులు వంటివి ఇందులో ఉంచాలి. ఇవి నీటిని పీల్చుకొని నిల్వ ఉండకుండా చేస్తాయి. అంతేకాకుండా ఇవి మొక్కల పెరుగుదలకు సహాయంగా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రకాల శిలీంద్రాలు రాకుండా కూడా ఇవి కాపాడుతాయి.
వర్షాకాలంలో ఈదురు గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొంచెం పొడవాటి మొక్కలు వంగిపోయే అవకాశం ఉంది. అయితే అలా కాకుండా ముందు జాగ్రత్తగా మొక్కలకు సపోర్టుగా కొన్ని కర్రలను ఏర్పాటు చేసి వాటితో జతకట్టాలి. ఇలా కట్టడం వల్ల ఈదురు గాలులకు అవి వంగిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇలా జతకట్టేటప్పుడు ఇనుపవీ కాకుండా కేవలం ఏదైనా చిన్నపాటి తాడుతో వదులుగా కట్టాలి లేకుంటే మొక్కలకు నీరు అంది అవకాశం ఉండదు.
కూరగాయలు పెంచే కుండీల్లో చిన్నచిన్న కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు లేకుండా చూడడమే మంచిది. వీటితో శిలీంద్రాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నేలలో పెంచేవారు అయితే మరింత జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే నెలలో నుంచి ఎక్కువగా వచ్చే శిలీంద్రాలతో వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది.
మిద్దె తోట పెంచేవారు సాధ్యమైనంత వరకు వాటిపై ఒక కవరు లేదా నీరు వచ్చే నెట్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే నేరుగా పడే వర్షపు నీరు కంటే వీటితో మొక్కలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా వీటి ద్వారా ఎక్కువగా తేమ మొక్కలకు అందదు.