Homeలైఫ్ స్టైల్Mobile Charger Safety Tips After Charging: మొబైల్ ఛార్జింగ్ పూర్తయ్యాక ఇలా చేస్తున్నారా..? అయితే...

Mobile Charger Safety Tips After Charging: మొబైల్ ఛార్జింగ్ పూర్తయ్యాక ఇలా చేస్తున్నారా..? అయితే డేంజర్..

Mobile Charger Safety Tips After Charging: విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు చాలామంది చేతిలో మొబైల్ కనిపిస్తూ ఉంటుంది. వివిధ అవసరాల నిమిత్తం మొబైల్ వాడిన సమయంలో చార్జింగ్ అయిపోతుంటుంది. అయితే ఫోన్ చార్జింగ్ పెట్టిన తర్వాత చాలామంది చార్జర్ ను ప్లగ్లో అలాగే ఉంచుతారు. కొందరు బిజీగా ఉండడంతో అలాగే ఉంచి మర్చిపోతుండగా.. మరికొందరు నిర్లక్ష్యంగా అలాగే వదిలేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల అనేక ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉందని కొన్ని సంఘటనలు తెలుస్తున్నాయి.. ఇప్పటివరకు జరిగిన మొబైల్ బ్లాస్టింగ్ లో చాలా వరకు చార్జరే కారణమని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. చార్జర్ నిల్వ ఉండే పవర్ తోనే మొబైల్ కు అధికంగా విద్యుత్ ప్రవాహం జరిగి ఈ ప్రమాదాలు జరిగినట్లు చెబుతున్నారు. అసలు మొబైల్ లోకి అధికంగా విద్యుత్ ప్రవాహం ఎలా జరుగుతుంది? చార్జరు పవర్ ప్లగ్ లో ఉండడంవల్ల ఏం జరుగుతుంది?

మొబైల్ ఛార్జింగ్ పూర్తి అయిన తర్వాత చార్జర్ ను ప్లగ్ లో అలాగే ఉంచితే ఇందులో విద్యుత్ ప్రవాహం అయ్యే అవకాశం ఉంది. ఈ చార్జర్ లోకి 0.1 W నుంచి 0.5 W వరకు విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. దీనినే స్పాండ్ పై పవర్ డ్రా అని అంటారు. దీంతో అనవసరంగా విద్యుత్ ప్రవాహం జరగడమే కాకుండా.. ఆ తర్వాత మొబైల్ కు కనెక్ట్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం అధికంగా జరుగుతుంది. దీంతో ఫోన్ ఒకసారిగా వేడెక్కి బ్యాటరీ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎప్పుడూ చార్జర్ లోకి విద్యుత్ ప్రవాహం జరగడం వల్ల ఇది తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చార్జింగ్ స్పీడ్ తగ్గడం.. అధికంగా వేడెక్కడం జరిగి ఆ తర్వాత పనిచేయకుండా పోతుంది. విద్యుత్ ఎక్కువ తక్కువ ప్రసారమయ్యే ప్రాంతాల్లో చార్జర్ ను ప్లగ్ లో ఉంచి అలాగే వదిలేయడం ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

అయితే ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొబైల్ ఛార్జింగ్ పూర్తయ్యాక వెంటనే చార్జర్ ను ప్లగ్ నుంచి బయటకు తీసేయాలి. కనీసం చార్జర్ ఉన్న స్విచ్ ఆఫ్ చేయాలి. కంపెనీ లేదా బ్రాండ్ కలిగిన చార్జర్ ను మాత్రమే వాడాలి. చార్జర్ మధ్యలో డ్యామేజి అయితే దానిపై ప్లాస్టర్ వేయకుండా కొత్త చార్జర్ తీసుకోవడం మంచిది. దిండు ఉండే ప్రదేశాల్లో లేదా పడుకునే ప్రాంతంలో చార్జింగ్ పెట్టుకోవడం అంత మంచిది కాదు. ప్లగ్ పాయింటు లూజుగా ఉండి లేదా సమస్యలు ఉంటే దానిని వెంటనే మార్చుకోవడం మంచిది . మొబైల్ చార్జర్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదు. ఎందుకంటే ఒక్కోసారి విద్యుత్ ప్రవాహం ఎక్కువై ఫోన్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version